Anchor Rohini Arrested: హేమ పై రోహిణి కౌంటర్ వేస్తుందా.. వీడియో వైరల్?

బెంగళూరు రేవ్ పార్టీ కేసు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఓ ప్రముఖ బిజినెస్మెన్ బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ రేవ్ పార్టీకి సినీ పరిశ్రమకు చెందిన ఎంతోమంది హాజరయ్యి.. పోలీసుల రైడ్ లో దొరికేశారు. ఇందులో నటి హేమ (Hema) కూడా ఉన్నట్టు బెంగళూరు పోలీసులు చెప్పి షాక్ కి గురి చేశారు. అయితే హేమ మాత్రం నేను హైదరాబాద్లోనే ఫామ్ హౌస్ లో ఉన్నట్టు తెలిపి అందరినీ తప్పుదోవపట్టించే ప్రయత్నం చేసింది.

ఆ తర్వాత కూడా ఆమె ఈ విషయాన్ని అంగీకరించలేదు. బుర్ఖాలో టెస్టులకు హాజరైన సంగతి తెలిసిందే. ఆ టైంలో కూడా నాకు ‘రేవ్ పార్టీతో సంబంధం లేదు, బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకోలేదు,నన్ను అనవసరంగా ఇరికిస్తున్నారు’ అంటూ బుకాయించింది. తర్వాత ఆమె రిమాండ్లో ఉండటం కూడా జరిగింది. సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. తాజాగా యాంకర్ రోహిణి కూడా రేవ్ పార్టీలో అరెస్ట్ అయినట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

‘బర్త్ డే పార్టీ అంటే వచ్చాను, నాకు ఏం సంబంధం లేదు, నాకింకా టెస్టులు కూడా చేయలేదు, పాజిటివ్ కూడా రాలేదు, ఇలా ఎవరైనా పార్టీ అని పిలిస్తే వివరాలు తెలుసుకోకుండా వెళ్లొద్దు’ అంటూ ఆమె మీడియాతో చెబుతున్నట్టు ఆ వీడియోలో ఉంది. ఇది కచ్చితంగా ప్రాంక్ అని అందరికీ అర్థమైపోతుంది. లేదు అంటే సినిమా ప్రమోషన్ లేదా అందులో సీన్ అయినా అయ్యుండొచ్చు. కానీ చాలా మంది యాంకర్ రోహిణి .. హేమ పై సెటైర్లు వేస్తుంది అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus