Shiva, Mitraaw: 6వ వారం నామినేషన్స్ లో తిక్క చూపించిన మిత్రా..! చచ్చిపోయిన చెల్లి ఎవరు ?

బిగ్ బాస్ హౌస్ లో ఆరోవారం నామినేషన్స్ లో హైలెట్ అంటే మాత్రం అది మిత్రా చేసిన డ్రామా అనే చెప్పాలి. ముఖ్యంగా శివ నామినేట్ చేసేటపుడు తన తిక్క మొత్తం చూపించింది. మిత్రా నామినేషన్స్ చూసిన వాళ్లందరూ కూడా కడుపు చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. అంతేకాదు, అక్కడున్న హౌస్ మేట్స్ కూడా నవ్వుతూనే ఉన్నారు. ముఖ్యంగా శివకి మిత్రాకి జరిగిన ఆర్గ్యూమెంట్స్ లో బిందుమాధవి అయితే నవ్వుతూనే ఉంది. సీరియస్ గా సాగాల్సిన నామినేషన్స్ కామెడీగా మారిపోయే సరికి అరియానా అందర్నీ అలర్ట్ చేసింది.

ఇది ఇంటి నుంచీ బయటకి వెళ్లిపోయే ప్రక్రియ అని, సీరియస్ గా జరగాలి కానీ, ఇలా కామెడీ చేయద్దని హౌస్ మేట్స్ కి గట్టిగా చెప్పింది. నాకు కూడా నవ్వొచ్చింది.. కానీ మనం సీరియస్ గానే ఉండాలంటూ హితవు చెప్పింది. దీంతో హౌస్ మేట్స్ అలర్ట్ అయ్యారు. అయినా కూడా మిత్రా శర్మా తన లాజిక్ లేని ఆన్సర్స్ తో శివకి పిచ్చెక్కించింది. దీంతో ఆర్గ్యూమెంట్ చేయలేక శివ అలసిపోయాడు. బిగ్ బాస్ తో మొరపెట్టుకున్నాడు. మనం అసలు మేటర్లోకి వెళితే.,

ముందు శివ మిత్రాని నామినేట్ చేస్తూ నాలుగు పాయింట్స్ చెప్పాడు. నేను నీ దగ్గర చేతులు కట్టుకుని నిలుచున్నానని మహేష్ విట్టాతో చెప్పావా లేదా అంటూ ప్రశ్నించాడు. బయట అసలు నేను నిన్ను ఎన్నిసార్లు కలిశానని అడిగాడు. అలాగే కోర్టు టాస్క్ లో నేను నిన్ను ఇన్ఫులెన్స్ చేసి సాక్ష్యం చెప్పమన్నావని అందరికీ చెప్పావ్ అని, నా మీద లేనిపోని నిందలు వేశావని మాట్లాడాడు. దీంతో మిత్రా శర్మా పూర్తిగా లాక్ అయిపోయింది. శివ మాట్లాడుతుంటే ఇక్కడ సీరియస్ జరగట్లేదని, టివి పెట్టిద్దామని మనిద్దరం నటిస్తే సీరియస్ రేటింగ్ అదిరిపోతుందని చెప్పింది.

ఇక్కడే తిక్క తిక్కగా మాట్లాడి శివతో ఒక ఆట ఆడుకుంది. మనది హై డ్రామా అవుతుంది. చేతులు కట్టుకోవడం, కాళ్లు పట్టుకోవడం, చెల్లి చచ్చిపోయింది. అమ్మకి ఆకలేస్తోంది అంటూ అలా తిక్క తిక్క ఆన్సర్స్ ఇచ్చింది. టివి సీరియస్ ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ తీద్దాం రా అంటూ రెచ్చిపోయింది. నిజానికి శివని అన్నయ్యా అంటూ పిలుస్తూ చాలా క్లోజ్ గా ఉంటుంది మిత్రా. అయితే, శివ పలకరించేటపుడు ఒకసారి ఈ చెల్లి చచ్చిపోయింది అన్నా అంటూ మాట్లాడింది. అప్పట్నుంచీ శివ మిత్రాని దూరం పెడుతూనే వచ్చాడు.

కానీ, ఇప్పుడు నామినేషన్స్ లో మాత్రం ఫుల్ గా ఇచ్చిపారేశాడు. ఎక్కడా కూడా తగ్గకుండా ఆన్సర్స్ చెప్పాడు. ఆతర్వాత మిత్రాశర్మా శివని నామినేట్ చేస్తూ మరోసారి డ్రామా క్రియేట్ చేసింది. నువ్వు నా పైన వేసిన నిందలు అన్నీ తప్పు అంటూ నామినేట్ చేసింది. కానీ, ఈ కారణాన్ని బిగ్ బాస్ అంగీకరించలేదు. మిత్రాని మరోసారి పిలిచి సరైన కారణం బిగ్ బాస్ కి చెప్పమన్నాడు. దీంతో మిత్రా నేను మాట్లాడటానికి వచ్చినా కూడా నువ్వు రాలేదని అందుకే నామినేట్ చేస్తున్నానని చెప్పింది. వీరిద్దరి మద్యన జరిగిన నామినేషన్స్ ఎపిసోడ్ లోనే హైలెట్ గా నిలిచాయి.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus