బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఓట్ అప్పీల్ టాస్క్ లో ఫ్రెండ్స్ అయిన శివ ఇంకా బిందు మద్యలో ఘర్షణ మొదలైంది. బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ చేసినప్పటి నుంచీ ఆడియన్స్ ఎప్పుడెప్పుడు ఎపిసోడ్ చూద్దామా అని వెయిట్ చేశారు. అంతేకాదు, లైవ్ లో బిందు , శివ గొడవ పడిన వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. బిగ్ బాస్ హౌస్ లో 60 నిమిషాల ఎపిసోడ్ లో మీరు ఎన్ని నిమిషాలు కనిపించారో దాన్ని బట్టీ బోర్డ్ ని ధరించమని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు.
ఇందులో 15 నిమిషాలు శివకి ఉంటుందని హౌస్ మేట్స్ మెజారిటీ ఓటింగ్ కి వచ్చారు. కానీ, బిందు ఇక్కడే శివతో ఆర్గ్యూమెంట్ చేసింది. నేను ఏకాభిప్రాయానికి రాను అంటూ మాట్లాడింది. నేనే 15 నిమిషాలకి అర్హత సంపాదించాను అని, నేను దానికోసం ఫైట్ చేస్తానని చెప్పింది. దీంతో శివకి బిందుకి ఆర్గ్యూమెంట్ అయ్యింది. నీ నోటీదుల వల్ల ఫుటేజ్ ఎక్కువగా కనిపించింది అని ఒప్పుకుంటే నేను ఓటు వేస్తానంటూ బిందు మాట్లాడింది. దీంతో శివ బిందుతో డిబేట్ చేశాడు. అసలు నువ్వు గేమ్ ఆడలేదని చాలాసార్లు అన్నావ్ అని, అప్పుడు నువ్వు ఎలా ఎక్కువ సేపు కనిపిస్తావని వాదించాడు.
నేను గేమ్ ఆడలేదని ఎప్పుడూ చెప్పలేదని, బెటర్ గా ఆడి ఉండాల్సింది అని మాత్రమే చెప్పానంటూ బిందు మాట్లాడింది. ఇద్దరి మద్యలో ఆర్గ్యూమెంట్ గొడవకి దారి తీసింది. ఫైనల్ గా నీకు నోటి దూల ఉందని, దానివల్లే వీకండ్ షోలో రెండు మూడుసార్లు హైలెట్ అయ్యావ్ అని, అందుకే ఎక్కువ సేపు కనిపించావని స్టేట్మెంట్ లాగా చెప్తూనే బిందు శివని ట్యాగ్ తీస్కోమని చెప్పింది. ఆ తర్వాత 11నిమిషాలు, 10 నిమిషాలు, 9 నిమిషాలు ట్యాగ్స్ కూడా తనకి వద్దని కేవలం 1.30 నిమిషం ట్యాగ్ ని మాత్రమే బిందు కోరుకుంది. దీనికి కూడా హౌస్ మేట్స్ ఒప్పుకోలేదు.
కాసేపు బిందు నేను 15 నిమిషాలకి అర్హురాలిని, లేదంటే మాత్రం నాకు ఒకటిన్నర నిమిషం ట్యాగ్ చాలని వాదించింది. అందరినీ ఒప్పించింది. ఇక బాబాభాస్కర్ మాస్టర్ కూడా అదే ట్యాగ్ ని మెడలో వేసుకున్నారు. ఆ తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర బిందు శివ ఇద్దరూ మాట్లాడుకున్నారు. బిందు ఇక్కడ శివకి సారీ చెప్పింది. ఒక లైన్ గీసుకుని హౌస్ లో అందరూ ఆడుతున్నారని అన్నానని దానికి సారీ అంటూ నువ్వు అందులో లేవ్ అంటూ చెప్పింది. అలాగే, నేను గేమ్ ఆడట్లేదని ఎప్పుడూ అనలేదని క్లారిటీ ఇచ్చింది. ఇద్దరి మద్యలో కాసేపు గొడవ జరిగిన తర్వాత చల్లబడ్డారు.
గార్డెన్ ఏరియాలో బిందు, శివ కూర్చుని ఇష్యూని సాల్వ్ చేసుకున్నారు. బిందు శివకి సారీ చెప్పింది. నోటి దూల అని అన్నందుకు నిజంగా సారీ అంటూ చెప్పింది. అలాగే శివ కూడా బిందుకి సారీ చెప్పాడు. నిజానికి ఇద్దరి మద్యలో ఎప్పట్నుంచో కొద్దిగా కోల్డ్ వార్ అనేది ఉంది. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అది బయటపడింది. ఎందుకంటే, ఏ గేమ్ లో కూడా శివ ఎప్పుడూ నాకు హెల్ప్ చేయలేదని బిందు చెప్పింది. గోల్డెన్ టిక్ ఇచ్చినా కూడా అది కేవలం స్వాప్ మాత్రమే చేశాడని క్లారిటీ ఇచ్చింది. దానికి కూడా నేను ఒప్పుకోలేదని, అక్కడ కూడా తన నోటిదూల చూపించాడని భావించింది.
ఇక్కడ బిందుతో ఫ్రెండ్షిప్ ఉన్నా కుడా శివ టాస్క్ లలో ఎప్పుడు బిందుకి హెల్ప్ చేయలేదు. అంతేకాదు, ఇద్దరూ కలిసి కూడా గేమ్ ఎప్పుడూ ఆడలేదు. ఇక ఆర్గ్యూమెంట్ విషయంలో ఇద్దరిదీ తప్పుంది. ఇద్దరూ ఒకే బోర్డ్ కోసం కొట్లాడినపుడు డిబేట్ చేసుకోవచ్చు. అదే బిందు చేసింది. దీనికి శివ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే, శివ నోరు జారి చాలాసార్లు అందరినీ మాట అనేశాడు. అదే వీకెండ్ లో హైలెట్ అవుతూ వచ్చింది. సరయు, హమీదా, నటరాజ్ మాస్టర్, అషూరెడ్డి వీళ్లతో శివ ఎక్కువగా నోరు జారి మాట్లాడాడు.
అందుకే, హైలెట్ అయ్యాడని చెప్పొచ్చు. అదే విషయాన్ని బిందు తన స్టైల్లో చెప్పింది. వీరిద్దరి మద్యలో జరిగిన ఆర్గ్యూమెంట్ వల్ల గేమ్ లో ఎవరు జెన్యూన్ గా ఉన్నారో ఆడియన్స్ కి క్లారిటీ వచ్చేసింది. అలాగే, మిగతా వాళ్లు ఎలా ఉన్నారు అని కూడా తెలుస్తోంది. ఇక ఒకరికొకరు సారీ చెప్పుకున్న తర్వాత ఎపిసోడ్ లో గెస్ట్ గా వచ్చిన అనసూయ తెచ్చిన ప్రశ్నలకి హౌస్ మేట్స్ ఆన్సర్ చేశారు.