Anchor Sreemukhi: ‘నిన్ను ఎన్నటికీ మర్చిపోలేను’ అంటూ శ్రీముఖి ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెర పై నిరంతరం అలరిస్తూనే అప్పుడప్పుడు వెండితెర పై కూడా సందడి చేస్తుంది. ‘బిగ్ బాస్3’ తర్వాత శ్రీముఖి ఎక్కువ సినిమాల్లో నటించలేదు.ఎక్కువగా బుల్లితెర షోలనే చేసుకుంటూ ముందుకు సాగుతుంది.అయితే మరో రెండు రోజుల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యే నితిన్ ‘మాస్ట్రో’ ద్వారా ఆమె ప్రేక్షకులను పలకరించనుంది. ఇదిలా ఉండగా.. ఈమె ఇంట విషాదం చోటు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

వివరాల్లోకి వెళితే.. సోమవారం నాడు అంటే సెప్టెంబర్ 13వ తేదీన శ్రీముఖి అమ్మమ్మ గారు కన్నుమూశారు. ఈ విషయాన్ని స్వయంగా శ్రీముఖినే తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారిందనే చెప్పాలి. ఈ విషయం శ్రీముఖి తన ఇన్స్టా ద్వారా స్పందిస్తూ.. “అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం. నా జీవితంలో ఆమె ఎన్నో విలువైన విషయాలను తెలిపింది. ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉండేది. అందరికీ ఆనందాన్ని పంచేది.

చాలా ధైర్యవంతురాలు కూడా. అమ్మమ్మ.. ‘నా జీవితంలో నువ్వు ఇచ్చిన ప్రతి దానికి స్పెషల్ థాంక్స్.నిన్ను మర్చిపోలేను. నీతో కలిసి పాటలు పాడిన సందర్భాలు..నీతో కలిసి డ్యాన్స్ చేసిన మూమెంట్స్ నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను… అంటూ తన అమ్మమ్మ గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది. శ్రీముఖి ఎమోషనల్ పోస్ట్ కు శేఖర్ మాస్టర్ వంటి వారు ఆమెకు ఫోన్ చేసి పరామర్శించారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus