సుమ ముందే తన బాయ్ ఫ్రెండ్ గురించి బయటపెట్టేసిన శ్రీముఖి..!

స్టార్ యాంకర్ శ్రీముఖి క్రేజ్ గురించి కానీ ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కానీ.. అందరికీ తెలిసిన విషయమే. కెరీర్ ప్రారంభంలో ‘జులాయి’ ‘నేను శైలజ’ ‘జెంటిల్ మెన్'(నాని) వంటి చిత్రాల్లో నటించిన శ్రీముఖి.. తరువాత బుల్లితెర పై ‘పటాస్’ అనే కామెడీ షోతో యూత్ కు బాగా దగ్గరయ్యింది. అక్కడి నుండీ బిజీ యాంకర్ గా మారిపోయి.. సినిమా ఈవెంట్ లను కూడా హోస్ట్ చేస్తూ బిజీగా గడుపుతూ వచ్చిన శ్రీముఖి..

కొన్నాళ్ల తరువాత ‘బిగ్ బాస్3’ రియాలిటీ షోలో కూడా ఎంట్రీ ఇచ్చి తన ఎనర్జీతో అన్ని టాస్క్ లలోనూ హైలెట్ గా నిలిచేది. అయితే ఆ షోలో ఓసారి తన లవ్ ఫెయిల్యూర్ గురించి చెప్పి కంటతడి పెట్టుకున్న శ్రీముఖి.. అతని పేరుని మాత్రం బయటపెట్టలేదు.అయితే ఆ టైములో తన కెరీర్ పైనే ఫోకస్ పెట్టినట్టు క్లారిటీ ఇచ్చింది. అయితే తాజాగా.. స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యే ‘స్టార్ట్ మ్యూజిక్’ అనే షోకి గెస్ట్ గా వచ్చింది శ్రీముఖి. ఆమెతో పాటు విష్ణు ప్రియ, హరి, పండు మాస్టర్, ఆర్జే చైతూ, రోల్ రైడా వంటి వారు కూడా హాజరయ్యారు.

ఈ షోకి సుమ హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉండగా.. గేమ్ మధ్యలో ఉన్నప్పుడు సుమ- శ్రీముఖి ల మధ్య బాయ్ ఫ్రెండ్ సంభాషణ వచ్చింది.ఈ షో నా బాయ్ ఫ్రెండ్ చూస్తున్నాడు.కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు కామెడీ చేసింది శ్రీముఖి. సదరు ఛానల్ వారు విడుదల చేసిన ప్రోమోలో ఇదే హైలెట్ గా నిలిచింది. ఈ విషయంతో పాటు మరో యాంకర్ విష్ణు ప్రియా చేసిన కామెడీ కూడా హైలెట్ గా నిలిచింది.


కాపటధారి సినిమా రివ్యూ & రేటింగ్!
దృశ్యం 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus