మాటలు, ఆలోచన ఉంటేనే అందరికీ అన్ని విషయాలు తెలిసిరావు. అనుభవాన్ని బట్టి, ఎదురుదెబ్బలు బట్టి ఎక్కువ విషయాలు తెలిసొస్తాయి. చాలా గట్టిగా తెలిసొస్తాయి. యాంకర్ సుమకి కూడా అలాగే తెలిసొచ్చింది. కేరళకి చెందిన అమ్మాయే అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులే సుమను ఎక్కువగా ఆదరించారు. నటిగా కెరీర్ ను ప్రారంభించిన ఈమె కల్యాణ ప్రాప్తిరస్తు, పవిత్ర ప్రేమ, వర్షం, వంటి సినిమాల్లో నటించింది.కానీ ఈమెకు వెండితెర అంతగా కలిసి రాలేదు.. కానీ బుల్లితెర పై మాత్రం బాగా క్లిక్ అయ్యింది.
ఎంతమంది యాంకర్లు వచ్చినా సుమను మాత్రం ఎవ్వరూ రీప్లేస్ చేయలేకపోయారు. దాదాపు రెండు దశాబ్దాలుగా నెంబర్ 1 యాంకర్ గా రాణిస్తుంది సుమ. సినిమా వేడుకలకు కూడా ఈమె యాంకరింగ్ చేస్తేనే అందం.సుమ యాంకర్ గా వ్యవహరించింది అంటే ఆ సినిమా పై కూడా మంచి క్రేజ్ ఏర్పడుతుంది అనే నమ్మకం దర్సకనిర్మాతల్లో ఏర్పడింది. అయితే సుమకి మళ్ళీ సినిమాల వైపు వెళ్ళాలి అనిపించినట్టుంది. ‘జయమ్మ పంచాయితీ’ తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
కానీ సుమను (Suma) ఎంతగానో అభిమానించే ప్రేక్షకులు ఆమె కోసం టికెట్ కొని థియేటర్ కు వెళ్లలేకపోయారు. సినిమా పెద్ద ప్లాప్ అయ్యింది. దీంతో ఇక జన్మలో యాక్టింగ్ జోలికి వెళ్ళకూడదు అని ఫిక్స్ అయ్యింది. ఇటీవల వరంగల్ నిట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో జరిగిన కాలేజ్ ఫెస్టివల్ కి సుమ హాజరైంది. అక్కడ ‘యాంకరింగ్ అంటేనే ఇష్టం… యాక్టింగ్ వద్దు.
నటన అస్సలు కలిసి రాలేదు’ అంటూ సుమ చెప్పుకొచ్చింది.అయితే సుమ మెయిన్ రోల్స్ చేస్తే.. కష్టం కానీ ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కథకి ప్రాధాన్యత ఉండే పాత్రలు వేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఆమె బుల్లితెర పై బోలెడన్ని షోలతో బిజీగా ఉండటం వల్ల అలా కంటిన్యూ అవ్వలేదు.
రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!