Anchor Suma: మంచి మనస్సు చాటుకున్న యాంకర్ సుమ.. వాళ్లకు సహాయం చేస్తూ?

టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ (Suma) గత రెండు దశాబ్దాలుగా నంబర్ వన్ యాంకర్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. సుమకు గతంతో పోల్చి చూస్తే ఆఫర్లు తగ్గినా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య మాత్రం తగ్గలేదు. సుమ హోస్ట్ చేస్తున్న షోలలో సుమ అడ్డా షో ఒకటి కాగా ఈ షో లేటెస్ట్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఓం భీమ్ బుష్ టీమ్ (Om Bheem Bush) సుమ అడ్డా షోకు కంటెస్టెంట్లుగా హాజరై అలరించడం గమనార్హం. అయితే రేపు యాంకర్ సుమ పుట్టినరోజు కాగా ఓం భీమ్ బుష్ టీం సుమకు సర్ప్రైజ్ ఇచ్చింది.

ఓల్డేజ్ హోంలో ఉండేవాళ్లను గెస్ట్ లుగా పిలిపించి వాళ్ల మధ్య సుమతో ఓం భీమ్ బుష్ టీం కేక్ కట్ చేయించింది. రోజాపూలతో వృద్ధులు సుమకు స్పెషల్ గా విష్ చేయడం గమనార్హం. అయితే ఒక వృద్ధురాలు షోలో మాట్లాడుతూ మీరు ఉన్నంత వరకు మాకు లోటు లేదని మీ మీద ఆశలు పెట్టుకుని బ్రతుకుతామని అన్నారు. మీరే మాకు అండ అని మాకు ఎవ్వరూ గుర్తుకు కూడా రావట్లేదని ఆ వృద్ధురాలు సుమను పట్టుకుని చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

వృద్ధులు ఉంటున్న వృద్ధాశ్రమానికి సుమ ఆర్థిక సహాయం చేశారని అందువల్లే వాళ్లు ఇంతలా ఎమోషనల్ అయ్యారని తెలుస్తోంది. హైదరాబాద్ లోని మియాపూర్ లో ఈ వృద్ధులు నివశించే అనాథ శరణాలయం ఉందని సమాచారం అందుతోంది. పూర్తి ఎపిసోడ్ ఈ నెల 23వ తేదీన ఈటీవీ ఛానల్ లో రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది.

యాంకర్ సుమ మంచి మనస్సును ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. సుమ రెమ్యునరేషన్ చాలామంది యాంకర్లతో పోలిస్తే ఎక్కువగా ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లతో సైతం బిజీగా ఉంటున్న సుమ కొడుకు కెరీర్ పై ప్రధానంగా దృష్టి పెట్టారని తెలుస్తోంది.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus