సుమకు మాత్రమే అన్యాయం జరిగిందా?

  • May 6, 2022 / 11:32 PM IST

బుల్లితెరపై ఈ ఛానల్ ఆ ఛానల్ అనే తేడాల్లేకుండా అన్ని ఛానెళ్లలో షోలు చేస్తూ పాపులారిటీని సంపాదించుకున్న సుమకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. సుమ ప్రధాన పాత్రలో శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన జయమ్మ పంచాయితీ సినిమా ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమాకు థియేటర్ల విషయంలో అన్యాయం జరిగిందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

ఈరోజు జయమ్మ పంచాయితీ సినిమాతో పాటు అశోకవనంలో అర్జున కళ్యాణం, భళా తందనాన సినిమాలు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్ లో ఈ రెండు సినిమాలకు దక్కిన స్థాయిలో సుమ సినిమాకు థియేటర్లు దక్కలేదు. పరిమిత సంఖ్యలో షోలతో హైదరాబాద్ లో ఈ సినిమా ప్రదర్శితం అవుతుండటం గమనార్హం. ఒక విధంగా సుమ సినిమాకు అన్యాయం జరిగిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 3.5 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తే మాత్రమే హిట్ అనిపించుకుంటుంది. మరి ఈ సినిమాకు ఆ స్థాయిలో కలెక్షన్లు వస్తాయా? అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మరోవైపు ఈ సినిమాకు బుకింగ్స్ ఆశాజనకంగా లేవు. ప్రేక్షకుల రెస్పాన్స్ పైనే ఈ సినిమా కలెక్షన్లు ఆధారపడి ఉంటాయని చెప్పవచ్చు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే సుమ మరిన్ని సినిమాలకు ఓకే చెప్పే ఛాన్స్ అయితే ఉంది.

సుమ గతంతో పోలిస్తే పరిమితంగానే బుల్లితెర షోలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈటీవీ, జీ తెలుగు ఛానెళ్లలో ఎక్కువగా సుమ షోలు ప్రసారమవుతున్నాయి. మరోవైపు పెద్ద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు సుమకు మాత్రమే హోస్ట్ గా అవకాశాలు దక్కుతున్నాయి. సుమ రెమ్యునరేషన్ ఎక్కువైనా సుమ తన మాటలతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతున్న నేపథ్యంలో ఆమెకు క్రేజ్ పెరుగుతోంది. సుమ దృష్టి పెట్టి ఉంటే ఎక్కువ సంఖ్యలో స్క్రీన్లు దొరికేవని ఆమె పొరపాటు చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus