ఓనం స్పెషల్.. సుమ ఇంట్లో సందడి చేసిన టాలీవుడ్ యాంకర్స్!

బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో యాంకర్ సుమ ఒకరు. ఈమె కేరళకు చెందిన అమ్మాయి అయినప్పటికీ స్పష్టంగా తెలుగు మాట్లాడుతూ తెలుగులో యాంకర్ గా ఎంతో బిజీగా మారిపోయారు. ఈ విధంగా బుల్లితెర కార్యక్రమాలు అలాగే సినిమా వేడుకలతో ఎంతో బిజీగా ఉండే సుమ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తూ ఉంటారు.

ఇకపోతే సుమ కేరళకు చెందిన అమ్మాయి కావడంతో కేరళలో జరుపుకునే అతిపెద్ద పండుగ ఓనం పండుగను కూడా ఈమె ప్రతి ఏడాది ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కేరళ సాంప్రదాయ పద్ధతిలో సుమ ఈ పండుగను నిర్వహిస్తూ ఉంటారు. అయితే ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఓనం పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. అయితే ఈ పండుగ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే యాంకర్స్ కి విందు భోజనం ఏర్పాటు చేశారు.

ఈ విధంగా టాలీవుడ్ యాంకర్స్ అందరిని కూడా తన ఇంటికి భోజనానికి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో భాగంగా అనసూయ రష్మి గౌతమ్ శ్యామల రవి విష్ణు ప్రియ నేహా చౌదరి వంటి వారందరూ కూడా ఈ విందు భోజనానికి హాజరైసందడి చేశారు. ఇలా ఇంటికి వచ్చిన అతిథులందరికీ స్వయంగా సుమ రాజీవ్ కనకాల దగ్గరుండి భోజనాలను వడ్డించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఎన్నో రకాల ఆహార పదార్థాలను తయారు చేయించి యాంకర్స్ అందరికీ సుమ విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో ఈ ఫోటోలలో పలువురు యాంకర్స్ కూడా కేరళ సాంప్రదాయ పద్ధతిలోని చీరలు ధరించి ఈ విందు కార్యక్రమానికి హాజరయ్యారని తెలుస్తోంది. ఇక సుమ కెరియర్ విషయానికి వస్తే ఈమె యాంకర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా బుల్లితెరపై మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున రిలీస్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus