తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ప్రపంచం మొత్తం వ్యాపించి ఉన్న తెలుగువారందరికీ సుపరిచితురాలైన హీరోయిన్ టర్నడ్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమై సుమ అనంతరం యాంకర్ గా మారి తొలుత పబ్లిక్ షోస్ హోస్ట్ చేసేది. ఆ తర్వాత జెమిని, ఈటీవీ చానల్స్ లో కొన్ని ప్రోగ్రామ్స్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించేది. టీవి9లో సినిమాలకి రివ్యూస్ చెబుతూ విశేషమైన పాపులారిటీ సంపాదించింది. ఇక ఉదయభాను, అనసూయ, రష్మీ లాంటి హాట్ & బ్యూటీఫుల్ యాంకర్స్ ఎందరోచ్చినా.. వారందర్నీ కేవలం తన వాక్చాతుర్యంతోనే కట్టడి చేసి రేస్ లో నెంబర్ ఒన్ గా నిలిచింది.
అయితే.. వీటన్నిటికంటే ఎక్కువగా సుమకి పేరు తీసుకొచ్చిన షో “స్టార్ మహిళా”. ఈటీవీలో గత పన్నెండేళ్లుగా నిరాటంకంగా నిర్వహించబడుతున్న ఈ షోకు ఎట్టకేలకు స్వస్తి పలకనుంది సుమ. దాదాపుగా 3000 ఎపిసోడ్స్ రన్ అయిన ఈ షో ఇంక మానేస్తున్నట్లు ప్రకటించింది సుమ. దాంతో “స్టార్ మహిళా” లేడీ ఫ్యాన్స్ అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే.. “స్టార్ మహిళా” కాకుండా సుమ మరో పదిపదిహేను షోలు హోస్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సొ, “స్టార్ మహిళా”తో మిస్ అయినా మిగతా షోస్ ద్వారా సుమను చూస్తూనే ఆమె యాంకరింగ్ ను ఎంజాయ్ చేయవచ్చు.