Suma: సుమ చేసిన పనికి నవ్వుతున్న నేటిజన్లు..!

ఎలాంటి విషయానైన్నా తనదైన శైలిలో జోక్ గా మారుస్తుంది సుమ. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ టమటా. దీనిపై ఇప్పటికే చాలా మంది స్పందించారు. ధరలు తగ్గించాలని వారికి నచ్చిన స్టైల్లో చెబుతున్నారు. తాజాగా ఈ విషయంపై సుమ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. తన ఇన్ స్టాలో దీనిపై ఓ ప్రత్యేక వీడియో చేసింది సుమ. టమాటాలను, బియ్యాన్ని దొంగతనం చేస్తూ అడ్డంగాా దొరికిపోయినట్లు నటించింది. ఈ రీల్ చూసిన వారంతా కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

సుమ మల్టీటాలెంటెడ్ అని తెగ పొగిడేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..ఇందులో ఒకతను బస్తాలో టమాటాలు తీసుకొస్తుండగా సుమ వెనక నుంచి వచ్చి అతడిని బెదిరించి టమాటాలను లాగేసుకుంటుంది. దీంతో ఆ టమాటాలు తీసుకొస్తున్న వ్యక్తి తన మొహాన్ని అమాయకంగా పెడతాడు. అదే సమయంలో అమెరికాలో పెరిగిన బియ్యం ధరలనూ వ్యంగ్యంగా స్పందించింది సుమ. టమాటాలు తీసుకొచ్చిన వ్యక్తి బస్తాలో బియ్యం తీసుకొస్తుండగా.. సుమ దౌర్జన్యంగా వాటిని లాక్కుంది. అమెరికాలో బియ్యం, ఇండియాలో టమాటాలు..

భరించలేకుండా ఉన్నాయి అంటూ సుమ (Suma) తన వీడియోలో చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియో చూసిన వారంతా ఒకటే నవ్వుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆఖరికి దొంగలా మారావా సుమక్క అని సరదాగా అంటున్నారు. అయితే ఈమధ్య సుమ ఒక యూట్యూబ్ ఛానల్ ను సైతం స్టార్ట్ చేసింది. ఛానల్ లో కూడా తనదైన కామెడీ వీడియోలను పలు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్లతో నవ్విస్తోంది. అంతేకాదు ఇంట్లో చేసే పనులకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తోంది .

యాంకరింగ్ తో పాటు సుమ ఆల్రౌండర్ అని నిరూపించుకుంటుంది. అయితే తాజాగా ఈమే తన భర్తతో కలిసి ఒక ఫుడ్ ప్రోడక్ట్ ను పచ్చళ్లను ప్రమోట్ చేసింది. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది . ఇక ఈ వీడియో చూసిన వారందరూ సుమను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఆ పచ్చళ్లకు సోషల్ మీడియాలో చాలామంది వ్యతిరేకత చూపిస్తున్నారు. సుమా చూపిస్తున్న ప్రొడక్ట్స్ ఏవి మంచిది కావని డెలివరీ చాల లేట్ అవుతుందని అంటున్నారు. డబ్బుల కోసం ఇంతకు దిగజారవా సుమ అంటూ కామెంట్స్ పెట్టారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus