Andrea Jeremiah: అలాంటి కథలపై ఆసక్తి లేదన్న ఆండ్రియా.. క్లారిటీ ఇచ్చేశారుగా!

భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండియాలో సింగర్ గా, నటిగా ఆండ్రియా (Andrea Jeremiah) మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. వడ చెన్నై సినిమాకు సీక్వెల్ నిర్మిస్తే చంద్ర పాత్రలో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆమె తెలిపారు. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో తాను ఎక్కువగా సాంగ్స్ పాడలేదని అయితే రాబోయే రోజుల్లో మాత్రం సాంగ్స్ కచ్చితంగా పాడతానని ఆండ్రియా వెల్లడించారు. హీరో కవిన్ తో కలిసి ప్రస్తుతం మాస్క్ అనే సినిమాలో నటిస్తున్న ఆండ్రియా చ‌రిత్ర, పురాణ కథల్లో నటించాలనే ఆశ, కోరికలు లేవని ఆమె చెప్పుకొచ్చారు.

Andrea Jeremiah

విజయ్ పాలిటిక్స్ లోకి రావడాన్ని తాను స్వాగతిస్తానని ఆండ్రియా పేర్కొన్నారు. నాకు మాత్రం రాజకీయాలలోకి రావాలనే ఆశ లేదని ఆమె పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీలో నేను ఆశించిన విధంగా హార్రర్‌, లవ్‌, కామెడీ జానర్లతో పాటు థ్రిల్లర్ జానర్ లో కూడా నటించానని ఆండ్రియా చెప్పుకొచ్చారు. వడ చెన్నై (Vada Chennai) సినిమాలో చంద్ర రోల్ కు మంచి గుర్తింపుతో పాటు ప్రశంసలు సైతం వచ్చాయని ఆండ్రియా వెల్లడించారు.

డైరెక్టర్ వెట్రిమారన్ (Vetrimaaran) వడ చెన్నై సీక్వెల్ తెరకెక్కిస్తే సీక్వెల్ లో నటించడానికి సిద్ధంగా ఉన్నానని ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని ఆండ్రియా పేర్కొన్నారు. ఆండ్రియా 2005 సంవత్సరం నుంచి విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఆండ్రియా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆండ్రియా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. ఆండ్రియా వాయిస్ కు సైతం ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆండ్రియాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆండ్రియా తెలుగు ప్రాజెక్ట్ లలో సైతం నటించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

 స్టార్ హీరో సింప్లిసిటీ… నడిరోడ్డుపై ఫొటోగ్రాఫర్‌కు చెప్పులు అందించి…

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus