టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాల్లేకుండా అన్ని ఇండస్ట్రీలలో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్లలో ఆండ్రియా (Andrea Jeremiah) ఒకరు కాగా హేమా కమిటీ రిపోర్ట్ గురించి ఆండ్రియా చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో Laiగిక వేధింపుల అంశం హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. మలయాళ ఇండస్ట్రీలో జరుగుతున్న ఘోరాల గురించి హేమా కమిటీ విడుదల చేసిన రిపోర్ట్ ఒకింత సంచలనం అయింది.
Andrea Jeremiah
నటిగా, సింగర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆండ్రియాకు సైతం హేమ కమిటీ రిపోర్ట్ కు సంబంధించిన ప్రశ్నలు ఎదురు కాగా ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆండ్రియా హేమ కమిషన్ రిపోర్ట్ గురించి నన్ను అడగొద్దని అన్నారు. సాధారణంగా హీరోయిన్లు ఇలాంటి నివేదికల గురించి స్పందించే విషయంలో ముందువరసలో ఉంటారు. తమకు ఎదురైన చేదు అనుభవాలను సైతం పంచుకుంటూ ఉంటారు.
అయితే ఆండ్రియా మాత్రం విభిన్నంగా స్పందించడం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆండ్రియా ప్రస్తుతం ఒకవైపు హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తూనే మరోవైపు కీలక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు. ఆండ్రియా రెమ్యునరేషన్ సైతం పరిమితంగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆండ్రియా తమిళ ప్రాజెక్ట్ లకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఆండ్రియా తెలుగులో మజాకా అనే మూవీలో నటించగా యుగానికొక్కడు మూవీ సైతం ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆండ్రియా గతంలో పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారు. ఆండ్రియాకు తెలుగు రాష్ట్రాల్లో సైతం ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది. ఆండ్రియా కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటే ఆమె ఖాతాలో మరిన్ని విజయాలు చేరడం పక్కా అని చెప్పవచ్ఛు. ఆండ్రియాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం ఊహించని స్థాయిలో పెరుగుతోంది.