Anee Master: అనీమాస్టర్ ఎలిమినేట్ అవుతూ హౌస్ మేట్స్ గురించి ఏం చెప్పిందో తెలుసా..!

బిగ్ బాస్ హౌస్ లో అనీమాస్టర్ జెర్నీ ముగిసింది. అత్యంత నాటకీయంగా జరిగిన సన్ డే ఎలిమినేషన్ ప్రక్రియలో ప్రియాంక ఇంకా అనీమాస్టర్ ఇద్దరూ చివరి వరకూ ఉన్నారు. వీళ్లిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది హౌస్ మేట్స్ చాలా ఉత్కంఠగా చూశారు. లాస్ట్ స్టెప్ వరకూ వెళ్లి రెడ్ మార్క్ టచ్ చేసిన అనీమాస్టర్ ని ఎలిమినేట్ చేశాడు కింగ్ నాగార్జున. దీంతో హౌస్ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. భావోద్వేగంతో అనీమాస్టర్ కళ్లనీళ్లు పెట్టుకుంది. శ్రీరామ్ చంద్ర, రవి, సన్నీ, ప్రియాంక , సిరిలు అనీమాస్టర్ ని చూస్తూ ఏడ్చేశారు.

మానస్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాదాపుగా 11 వారాలపాటు తనదైన స్టైల్లో ఎంటర్ టైన్ చేసిన అనీమాస్టర్ వెళ్లిపోతూ హౌస్ మేట్స్ ని ఏడిపించేసింది. అందరితో కూడా ప్రత్యేకమైన బాండింగ్ ని పెట్టుకుంది అనీమాస్టర్. కాజల్ ని సైతం హగ్ చేస్కుని ఆల్ ద బెస్ట్ చెప్పింది. ఎలిమినేట్ అయి బయటకి వచ్చి స్టేజ్ పైన నాగార్జునతో మాట్లాడుతూ తన జెర్నీని చూసి బాగా ఏడ్చేసింది. ఎమోషనల్ గా గుండె బరువెక్కిపోయిందంటూ చెప్పింది. ఇక రవితో మాట్లాడుతూ హౌస్ లో నాకు ఒక మంచి తమ్ముడు దొరికాడు అని చెప్పింది.

నేను లోన్లీగా ఉన్నప్పుడు రవి వచ్చి నన్ను మోటివేట్ చేసేవాడు అంటూ మాట్లాడింది. శ్రీరామ్ అయితే మంచి ఫ్రెండ్ అయిపోయాడు అని, బ్రదర్ కంటే ఎక్కువ అయ్యాడని చెప్పింది. షణ్ముక్ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాడు అంటూ చెప్పింది. ఇక సిరి పటాకా లాంటిది అని సూపర్ గా గేమ్ ఆడుతోందని చెప్పకొచ్చింది. బటర్ ఫ్లై ప్రియాంక అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది. సన్నీ , మానస్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారని చెప్పింది. ఇక సన్నీ నాతో చేసిన ఫన్ చాలా నచ్చిందని, అతడ్ని నేను బాగా మిస్ అవుతానని చెప్పింది.

బయటకి వచ్చిన తర్వాత మాట్లాడదాం అంటూ చెప్పుకొచ్చింది. ఇక కాజల్ గురించి చెప్పేది ఏమీ లేదని, తన గేమ్ ఆడుతోందని చెప్పింది. అందరికీ గుడ్ బై చెప్పిన అనీ బరువెక్కిన గుండెతో బయటకి వచ్చింది. అనీమాస్టర్ బయటకి వచ్చిన తర్వాత బిగ్ బాస్ బజ్ అరియానాతో ఇంటర్య్వూలో తనపై ఉమాదేవి చేసిన షాకింగ్ కామెంట్స్ ని విన్నది. ఇప్పుడు ఈ ఇంటర్య్వూ వైరల్ గా మారింది. మరి ఆ ఇంటర్య్వూ ఎలా ఉంటుందో తెలియాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus