Bigg Boss 5 Telugu: పింకీకి అనీమాస్టర్ కి గొడవ..! అన్ సీన్ లో జరిగింది ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో ఫైర్ ఇంజన్ ట్రక్ టాస్క్ లో పింకీకి అనీమాస్టర్ కి పెద్ద యుద్ధమే జరిగింది. అనీమాస్టర్ యాక్టింగ్ నెంబర్ 1 అనే సరికి పింకీ తీస్కోలేకపోయింది. దీంతో అనీమాస్టర్ పై ఫైర్ అయ్యింది. అనీమాస్టర్ కూడా నిన్ను అద్దేశ్యించి అనలేదు. నన్ను నమ్ము అంటూ తన ప్రొఫెషన్ పైన ఒట్టువేసింది. ఇక్కడితో ప్రియాంక టాపిక్ వదలేసింది. అయితే, వీరిద్దరి మద్యలో అన్ సీన్ లో ఒక ఆర్గ్యూమెంట్ అయ్యింది. రేషన్ మేనేజర్ గా ఉన్న మానస్ ప్రియాంకని కిచెన్ లో మేడమ్ కర్రీ వండుతోంది చూస్కో అన్నాడు. దీంతో వెజిటిబుల్స్ కట్ చేస్తున్న అనీమాస్టర్ కి , పింకీకి క్లాష్ అయ్యింది.

వాష్ రూమ్ నుంచీ పింకీ కిచెన్ లోకి వచ్చిందేంటి నాకు క్లారిటీ లేదు అంటూ అనీమాస్టర్ కెప్టెన్ రవికి చెప్పింది. దీంతో రవి పంచాయితీ చేశాడు. పింకీ నన్ను మానస్ చూస్కోమన్నాడు అందుకే వచ్చాను అంటూ చెప్పింది. మాస్టర్ మీరు హర్ట్ అవ్వకండి చిన్న విషయమే నేను మీరు హర్ట్ అయితే ఉండలేను అంటూ మాట్లాడింది ప్రియాంక. దీనికి అనీమాస్టర్ అలిగింది. కిచెన్ లో కర్రీ నేను చేయను పింకీ చేస్తుంది అంటూ బెడ్ రూమ్ కి వెళ్లి కూర్చుంది. దీంతో కెప్టెన్ రవి, రేషన్ మేనేజర్ మానస్ అనీ మాస్టర్ కి సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు.

అప్పట్నుంచీ అనీమాస్టర్ కి పింకీకి కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. మరో వైపు అన్ సీన్ లో మానస్ కెప్టెన్ అయిన తర్వాత పింకీ నువ్వు విన్నర్ అవుతావ్ నీకేం తక్కువ అంటూ మాట్లాడింది. అక్కడే సిరి విషయం కూడా వచ్చింది. కెప్టెన్సీ టాస్క్ జరిగేటపుడు ఇట్స్ పే బ్యాక్ టైమ్ అనుకుంటా అని సిరి అనడం నచ్చలేదంటూ పింకీ మాట్లాడింది. అంతేకాదు, అసలు ఆ అమ్మాయి అలా ఎలా అంటుంది. నీకోసం ఏమైనా టాస్క్ ని త్యాగం చేసిందా అంటూ మాట్లాడింది. అది కరెక్ట్ కాదని చెప్పింది.

ఇదే విషయాన్ని కాజల్ ఇంకా సన్నీ కూడా డిస్కస్ చేసుకున్నారు.పే బ్యాక్ అని ఎలా అంటుంది అంటూ కాజల్ సన్నీతో చెప్పింది. నేను కూడా బయట చాలామందికి క్యాష్ ఇచ్చాను అస్సలు పే బ్యాక్ చేయలేదు అంటూ సన్నీ ఫన్నీగా కామెంట్ చేశాడు. ఇక టాస్క్ లో గెలిచిన మానస్ కెప్టెన్ అయిన తర్వాత కాజల్ ని హగ్ చేసుకుని సారీ చెప్పాడు. సన్నీ, కాజల్ మానస్ ముగ్గురూ కూడా హగ్ చేస్కుంటూ తమ ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో చెప్పారు. అదీ విషయం

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus