Guppedantha Manasu: విశ్వనాథం కోరిక విని షాక్ అయిన రిషి వసుధార!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందనే విషయానికి వస్తే ఏంజెల్ రిషి గురించి తనకు జరిగిన ప్రమాదం గురించి చెబుతుంది రిషిని ఎవరో హత్య చేయడానికి ప్రయత్నం చేశారు కొన ఊపిరితో ఉన్న తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తామని చెప్పడంతో ఒక్కసారిగా జగతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. చాలా పెద్ద సహాయం చేసావ్ థాంక్యూ అంటూ కన్నీళ్లు పెట్టుకోగా వసుధర ఏంజెల్ ను హగ్ చేసుకుని తనకు థాంక్స్ చెబుతుంది.

తన గురించి చెబితే మీరు ఎందుకు ఎమోషనల్ అవుతున్నారని ఏంజెల్ అడుగుతుంది. నువ్వు ఒక ప్రాణాన్ని కాపాడావు ఆ కుటుంబం ఎప్పుడు నీకు రుణపడి ఉంటుందని జగతి చెబుతుంది. మరోవైపు గదిలో ఏదో ఆలోచిస్తూ ఉన్నటువంటి రిషి దగ్గరకు మహేంద్ర వెళ్లి ఈరోజు ఒకటి నీ దగ్గర పడుకుంటాను అనే రిక్వెస్ట్ చేస్తాడు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు అంటూ మహేంద్ర మాట్లాడుతారు. ఇలా తన కొడుకుని రిక్వెస్ట్ చేయడంతో కాదనలేక రిషి తన దగ్గర పడుకోవడానికి ఒప్పుకుంటాడు.

ఎలాగైనా నీకు నిజం తెలిసేలా చేసి నిన్ను మాతోపాటు ఇంటికి తీసుకెళ్లాలని మహేంద్ర ఆలోచిస్తూ ఉంటారు. మహేంద్ర రిషి ఓకే గదిలో పడుకోవడం చూసిన ఏంజెల్ విశ్వం దగ్గరకు వెళ్లి చెబుతుంది వారి మధ్య ఏదైనా సంబంధం ఉందా అని ప్రశ్నిస్తుంది అది విన్నటువంటి వసుధార అనుమానం వచ్చిందని భావించి వారిద్దరూ ఆత్మీయులు కదా అంతకుమించి వారి మధ్య ఏముంటుంది అందుకే మహేంద్ర సార్ అక్కడ పడుకోవాలనుకున్నారేమోలే అంటూ మాట మారుస్తుంది.

నీ గదిలో మేడం పడుకున్నారు కదా వసుధార మనిద్దరం ఇక్కడే పడుకుందాంలే అని ఏంజెల్ మాట్లాడుతుంది. ఏంజెల్ మాట్లాడుతూ రిషి నేను గౌతం క్లాస్మేట్స్. అప్పటినుంచి రిషి చాలా సైలెంట్ గా ఉండేవారు. నేను గౌతమ్ చాలాక్లోజ్ ఇప్పుడు ఆ గౌతమ్ ఎక్కడున్నారో? మహేంద్ర సర్కి ఏమైనా తెలిసి ఉంటుంది తనని అడిగితే తెలుస్తుంది కదా పని ఏంజెల్ అనడంతో రిషి సార్ కి తెలియకుండా మనం ఇలా ఎంక్వయిరీ చేస్తున్నామని తెలిస్తే రిషి సార్ బాధపడతారని వసుధార చెపుతుంది.

అవును అని ఏంజెల్ అనుకుంటుంది తర్వాత ఇంకేంటి వసుధార నువ్వు ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని మాట్లాడుతూ ఉండగా అక్కడికి రిషి రావడంతో రా రిషి కరెక్ట్ సమయానికి వచ్చావు అని ఏంజెల్ చెబుతుంది నాకు ఇలాంటివన్నీ నచ్చవని చెబుతాడు. ఇక ఏంజెల్ గౌతమ్ ఫోన్ నెంబర్ నీ దగ్గర ఏమైనా ఉందా అని అడగడంతో తన దగ్గర లేదని చెప్పి వెళ్ళిపోతాడు.

మరుసటి రోజు కాలేజీలో విశ్వం మీటింగ్ ఏర్పాటు చేస్తారు .అంతలోపు రిషి వసుధార అక్కడికి వస్తారు . వాళ్లు రాగానే విశ్వం మాట్లాడుతూ జగతి మహేంద్ర సార్ వాళ్లు వారు చేపట్టిన మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ మీరు టేక్ ఓవర్ చేయాలని చెప్పారు అనడంతో ఒక్కసారిగా రిషి వసుధార షాక్ అవుతారు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus