Anika Surendran: అనిఖా సురేంద్రన్ మరణించిందంటూ షాకింగ్ పోస్ట్..!

అనిఖా సురేంద్రన్… అందరికీ సుపరిచితమే. 3 ఏళ్లకే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆల్రెడీ 20 కి పైగా సినిమాల్లో నటించేసింది. 18 ఏళ్ళకే తెలుగు సినిమాలో హీరోయిన్ గా కూడా నటించేసింది.2019 లో అజిత్ హీరోగా వచ్చిన ‘విశ్వాసం’ లో.. అతని కూతురు శ్వేత పాత్రలో నటించి మెప్పించిన ఈ బ్యూటీ ‘ఘోస్ట్’ సినిమాలో నాగార్జున మేనకోడలు అదితి పాత్రలో నటించింది. ఇక ఇటీవల వచ్చిన ‘బుట్టబొమ్మ’ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా లీడ్ రోల్ పోషించింది.

ఆ సినిమాలో సత్య అనే మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిగా చాలా పద్ధతిగా కనిపించింది. అలాగే హీరోయిన్ గా మరో సినిమాలో కూడా నటిస్తుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె చనిపోయింది అంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో ఆమె అభిమానులు కంగారు పడ్డారు. ఈమె చనిపోయినట్లు ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని వల్లే ఈమె మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే అందులో నిజం లేదు. అది (Anika Surendran) ఈమె నటిస్తున్న సినిమాలకు సంబంధించినది. అసలు విషయం తెలియడంతో ఈమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈమె టాప్ హీరోయిన్ అవ్వాలి అంటూ బెస్ట్ విషెస్ కూడా చెబుతున్నారు. గతంలో కూడా షకీలా, మహేష్ ఆచంట వంటి వారు మరణించినట్టు ప్రచారం జరిగింది. అందుకు వాళ్ళు కూడా చాలా బాదపడినట్టు చెప్పుకొచ్చారు. తాజాగా అనికా సురేంద్రన్ విషయంలో మరోసారి ఇలా జరిగింది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus