Viswambhara: చిరంజీవి కొత్త సినిమా ‘విశ్వంభర’ టైటిల్‌ వీడియో అఖిల్‌ డైరక్టర్‌ది!

‘రాధేశ్యామ్‌’ సినిమా చూశారా? అందులో ‘నీ రాతలే…’ అనే పాట చూసే ఉంటారు. సినిమా చూడకపోయినా యూట్యూబ్‌లోనో, టీవీలో అయినా ఈ పాట చూసి ఉంటారు. ఇప్పుడు విషయం ఏంటంటే… ఆ పాట కాన్సెప్ట్‌ డిజైన్‌ చేసిన వ్యక్తి. చిరంజీవి – మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమా టైటిల్‌ను రిలీజ్‌ చేయడానికి టీమ్‌ ఓ కాన్సెప్ట్‌ వీడియోను రిలీజ్‌ చేసింది. అది వచ్చినప్పటి నుండి ఓ కుర్ర టెక్నీషియన్‌ పేరు టాలీవుడ్‌లో మారుమోగుతోంది.

ఆయన పేరే అనిల్‌ కుమార్‌ ఉపాధ్యాయుల. టైటిల్ కాన్సెప్ట్ వీడియో బాగుందంటూ ఆడియెన్స్, మెగాభిమానులు మాట్లాడుకుంటున్నారు. వీడియోలోని విజువల్‌ ఎఫెక్ట్స్‌, కాన్సెప్ట్ గురించి టాలీవుడ్‌ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. దీంతో అనిల్‌ కుమార్‌ పేరు కూడా మారుమోగుతోంది. నిజానికి అనిల్‌ కొత్తవారేం కాదు. ‘సాహో’, ‘రాధేశ్యామ్‌’కి పని చేశారు. ఎందుకంటే ఆయన యూవీ క్రియేషన్స్‌లో అసోసియేట్ డైరెక్టర్. ఆయన పనితనం నచ్చి ఇప్పుడు ‘విశ్వంభర’ (Viswambhara) వర్క్‌ అప్పగించారట.

ఇంత బాగా కాన్సెప్ట్‌లు చేస్తున్నారు… సినిమా డైరక్షన్‌ ఎప్పుడు అని అడుగుదాం అనుకుంటున్నారా? అయితే అడిగేయండి ఎందుకంటే ఆన్సర్‌ సిద్ధంగా ఉంది. అనిల్‌ కుమార్‌ కొన్ని నెలలుగా ఓ కథను ఫైనల్‌ డ్రాఫ్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. అఖిల్‌ హీరోగా ఓ సినిమా చేయాలని అనిల్‌ చేసిన ప్రయత్నాలు దాదాపు ఫలించాయి. త్వరలోనే ఈ సినిమాను భారీగా స్థాయిలో అనౌన్స్‌ చేస్తారట. ఆ సినిమాను పూర్తి స్థాయిలో మాస్‌ మసాలా యాక్షన్‌ ఓరియెంటెడ్‌గా చేస్తారట.

‘ఏజెంట్‌’ సినిమా తర్వాత అఖిల్‌ కొత్త సినిమాలేం ఓకే చేయలేదు. చాలామంది దర్శకుల పేర్లు చర్చకు వచ్చినా అనిల్‌ కుమార్‌ ఉపాధ్యాయుల కథ విషయంలోనే అఖిల్‌ ఆసక్తిగా ఉన్నారట. సరైన మాస్‌ కమర్షియల్‌ విజయం కోసం అఖిల్‌ చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. మధ్యలో కొన్ని ఇతర జోనర్‌లు చేసినా యాక్షన్‌ ఇచ్చే కిక్ వేరే ఏదీ ఇవ్వదు అని హీరోలు అంటూ ఉంటారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus