అనిల్ రావిపూడి ‘ప్లాన్ బి’ వర్కౌట్ అవుతుందా?

అపజయమెరుగని కమర్షియల్ దర్శకుల లిస్ట్ లో రాజమౌళి, కొరటాల శివ తరువాత అనిల్ రావిపూడి కూడా చేరిపోయాడు . ‘పటాస్’ ‘సుప్రీమ్’ ‘రాజా ది గ్రేట్’ ‘ఎఫ్2’ ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి వరుస బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. ఈ ఏడాది మహేష్ బాబు ‘సరిలేరు’ తో పెద్ద హీరో మాస్ ఇమేజ్ ను కూడా హ్యాండిల్ చెయ్యగలను అని ప్రూవ్ చేసుకున్నాడు. అయితే అంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టినా.. అనిల్ ఇప్పుడు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆల్రెడీ ‘ఎఫ్2’ సీక్వెల్ అయిన ‘ఎఫ్3’ స్క్రిప్ట్ ని 80 శాతం పూర్తి చేసాడు. మరో నెలలో మిగిలిన స్క్రిప్ట్ కూడా పూర్తయిపోతుంది. అయితే ఇప్పుడు వెంకటేష్ కానీ, వరుణ్ తేజ్ కానీ షూటింగ్ లో జాయిన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. వెంకీ ‘నారప్ప’ షూటింగ్ పూర్తి చెయ్యాలి. తరువాత రానా పెళ్లి కూడా ఉంది. కాబట్టి ఇప్పట్లో కష్టమే. మరో పక్క వరుణ్ కూడా ‘ఫైటర్'(వర్కింగ్ టైటిల్) ప్రాజెక్ట్ చెయ్యాల్సి ఉంది. అవి వైరస్ మహమ్మారి వల్ల ఇప్పట్లో పూర్తయ్యేలా లేవు.

ఎంత కాదనుకున్నా వచ్చే ఏడాది వరకూ ‘ఎఫ్3’ షూటింగ్ మొదలు పెట్టడం కష్టమే. ఇలాంటి తరుణంలో అనిల్ దగ్గర.. నాని లాంటి హీరోకి సరిపడా స్క్రిప్ట్ ఉందట. నాని ఎలాగూ ఖాళీ లేడు కాబట్టి అఖిల్ తో ఆ ప్రాజెక్ట్ ను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. అది కూడా వర్కౌట్ కాకపోతే ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ కూడా తన దగ్గర రెడీగా ఉందట. ఎలాగూ 2 లేదా 3 నెలల్లో సినిమాని ఫినిష్ చేయగల సిద్ధహస్తుడు కాబట్టి.. ‘ఎఫ్3’ మొదలయ్యే లోపు ఓ సినిమాని తెరకెక్కించాలని అనిల్ ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus