Ravi Teja, Balakrishna: అనిల్‌ రావిపూడి సినిమాలో బాలయ్యతో రవితేజ!

సినిమాలో హీరో పాత్రను రవితేజ ఈ మధ్య ఎక్కువగా షేర్‌ చేసుకుంటున్నాడని చదువుకున్నాం. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణతో కూడా రవితేజ కలసి నటిస్తాడని చెప్పాం. అప్పుడు పుకారుగా ఉన్న ఈ విషయం.. ఇప్పుడు ఆల్‌మోస్ట్‌ కన్‌ఫామ్‌ స్టేజీకి వచ్చేసింది. ఇటీవల జరిపిన కథా చర్చల నేపథ్యంలో రవితేజ ఈ సినిమా చేయడానికి అంగీకరించారు అని సమాచారం. దీంతో అనిల్‌ రావిపూడి సినిమాలో బాలయ్య పక్కన రవితేజ అనే మాట ఫైనల్‌ అయినట్లే.

బాలకృష్ణ, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఆ మధ్య ‘అన్‌స్టాపబుల్‌’ షోలో బాలకృష్ణ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు కూడా. అయితే అప్పుడు ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారు అనే మేటర్‌ కూడా బయటికొచ్చింది. ఆ పాత్ర కోసం యువ హీరోతో చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు కూడా. అయితే ఆ చర్చలు రవితేజ దగ్గరకు వచ్చి ఆగాయి. దీనిపై పలుమార్లు చర్చలు జరిపిన అనంతరం ప్రాజెక్ట్‌ ఓకే అయ్యింది అంటున్నారు.

అనిల్‌ రావిపూడితో సినిమా అంటే పక్కాగా ఫన్‌ రోలర్‌ కోస్టర్‌ అంటారు. అలాంటిది బాలయ్యతో ఫన్‌ అంటేనే వావ్‌ అనుకుంటే, ఇప్పుడు అందులో రవితేజ కూడా యాడ్‌ అయితే అది డబుల్‌, ట్రిపుల్‌ అవుతుంది. సినిమా కథేంటి, కాన్సెప్ట్‌ ఏంటి అనే విషయాలు బయటకు రాలేదు. అయితే సినిమాలో బాలయ్య పోలీసుగా కనిపిస్తాడని పుకార్లు మాత్రం వినిపిస్తున్నాయి. అది కూడా ‘పటాస్‌’, ‘టెంపర్‌’ సినిమాలో హీరోలాగా ఉంటారని టాక్‌.

మరి ఈ సినిమాలో బాలయ్యను అనిల్‌ రావిపూడి అలానే చూపించబోతున్నాడా? చూపిస్తే ఆ క్యారెక్టర్‌లో బాలయ్య ఎలా ఉంటాడు అనేది ఆసక్తికరం. ఇప్పుడు సినిమాలో రవితేజ కూడా యాడ్‌ అయ్యాడు. అతని పాత్ర కూడా పోలీసే అని సమాచారం. రవితేజ పోలీసు అయితే వినోదం ఎలా ఉంటుందో గతంలో చూశాం. ఇప్పుడు మరోసారి ట్రిపుల్‌ ఫన్‌ బొనాంజా చూడొచ్చన్నమాట. త్వరలోనే సినిమా వివరాల అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది. సో కొన్ని రోజులు వెయిట్‌ చేస్తే ఫుల్ డీటెయిల్స్‌ పక్కా.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus