నాకు ఏ హీరోయిన్ తోనూ ఎఫైర్ లేదు : అనిల్ రావిపూడి

‘పటాస్’ ‘సుప్రీమ్’ ‘రాజా ది గ్రేట్’ వంటి హ్యాట్రిక్ హిట్లతో కమర్షియల్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి . ఇప్పుడు ‘ఎఫ్ 2’ చిత్రంతో మరోసారి అలరించడానికి సిద్దమయ్యాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో అనిల్ రావిపూడికి ఒక హీరోయిన్ తో ఎఫైర్ ఉన్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆ హీరోయిన్ కు అవకాశాలు ఇమ్మని తనకు తెలిసిన దర్శకులకి రికమండ్ చేస్తున్నాడనే ప్రచారం కూడా చాలా జరిగింది. అయితే ఈ విషయాన్నీ అప్పట్లో అనిల్ పెద్దగా పట్టించుకోలేదు.

అయితే తాజాగా ‘ఎఫ్2’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం పై స్పందించాడు అనిల్. ఈ విషయానికి అనిల్ స్పందిస్తూ… “నాకు ఏ హీరోయిన్ తోను ఎఫైర్ లేదు .. నేను ఎవరినీ రికమెండ్ చేసిందీ లేదు. నేను ఎలాంటివాడినన్నది నా కుటుంబసభ్యులకు తెలుసు .. నా స్నేహితులకు తెలుసు.నాది చాలా హ్యాపీ ఫ్యామిలీ. నేను తప్పు చేశాను అనిపిస్తే మా ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పాలి… చెబుతాను. అలాగే నా సినిమాలు చూసే.. ప్రేక్షకులకి సమాధానం చెప్పాలి… కచ్చితంగా వాళ్ళకి కూడా నేను సమాధానం చెప్పడానికి నేను సిద్ధం. ఇప్పటి వరకు నాకు అలాంటి అవసరం రాలేదు… రాదు కూడా..! కొంతమంది పనిగట్టుకుని ఈ గాసిప్స్ చదువుతారు.. ఆ చదివే వాళ్ళ కోసమే.. కొంతమంది ఏమి లేకపోయినా ఈ గోసిప్స్ రాస్తారు… వాటిని ప్రచారం చేస్తూ ఆనందాన్ని పొందుతుంటారు. అలాంటి గాసిప్స్ ను నేను ఎంతమాత్రం పట్టించుకోను” అంటూ వివరణ ఇచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus