Anil Ravipudi, Balakrishna: బాలయ్య రోల్ పై అనిల్ రావిపూడి క్లారిటీ ఇదే!

బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబో మూవీ షూటింగ్ డిసెంబర్ 8వ తేదీ నుంచి మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల కనిపించనుండగా బాలయ్యకు జోడీగా నటించే హీరోయిన్ విషయంలో వేర్వేరు పేర్లు ప్రచారంలోకి రావడం గమనార్హం. ఈ సినిమాలో బాలయ్య పాత్రకు సంబంధించి అనిల్ రావిపూడి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ మధ్య కాలంలో బాలయ్య వరుసగా సినిమాలలో డ్యూయల్ రోల్ లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.

అయితే తన సినిమాలో మాత్రం బాలయ్య సింగిల్ రోల్ లోనే కనిపిస్తారని అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. సాహో గారపాటి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా బాలయ్య తరహా సినిమాలతో పాటు తన తరహా సినిమాలను సమన్వయం చేసి బాలయ్యతో సినిమా తీయనున్నానని ఆయన పేర్కొన్నారు. అటు బాలయ్య అభిమానులకు ఇటు తన సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉండనుందని ఆయన స్పష్టతనిచ్చారు. బాలయ్య పాత్ర ఫన్ చేయదని అయితే సినిమాలో ప్రేక్షకులను నవ్వించే సన్నివేశాలు మాత్రం ఉన్నాయని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.

తన సినిమాలకు కలెక్షన్లు రావడం లేదని బయ్యర్లకు నష్టాలు వచ్చాయని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని అనిల్ రావిపూడి కామెంట్లు చేశారు. సినిమాలలో ఫన్ పుట్టించడం తేలిక కాదని అనిల్ రావిపూడి అభిప్రాయం వ్యక్తం చేశారు. బాలయ్యతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమాను తెరకెక్కించాలని అనిల్ రావిపూడి భావిస్తున్నారని తెలుస్తోంది.

భారీ బడ్జెట్ తో బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ తెరకెక్కుతుండగా వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus