‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి కూడా అదే ఫార్ములా అప్లై చేసాడు..!

సాధారణంగా సినీ పరిశ్రమలో సెంటిమెంట్లు బాగా ఎక్కువ. అభిమానులకి మాత్రమే కాదు దర్శక నిర్మాతలకి కూడా అదే రేంజ్లో సెంటిమెంట్లు ఉంటాయి. మన యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా కెరీర్ ప్రారంభం నుండీ ఓ సెంటిమెంట్ ను ఫాలో అవుతూ వస్తున్నాడు. ఇప్పుడు ఆయన మహేష్ బాబు తో తెరకెక్కించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి కూడా ఆయన మొదటి నుండీ ఫాలో అవుతున్న సెంటిమెంట్ ను అప్లై చేసాడు.

Anil Ravipudi following the same sentiment1

విషయం ఏమిటంటే.. అనిల్ రావిపూడి మొదటి చిత్రం ‘పటాస్’ లో శృతి సోది హీరోయిన్ గా నటించింది. ఈ భామని అనిల్ తన రెండో సినిమా ‘సుప్రీమ్’ లో కూడా ఓ పాటలో పెట్టుకున్నాడు. ఇక తరువాతి సినిమా ‘రాజా ది గ్రేట్’ లో .. ‘సుప్రీమ్’ హీరోయిన్ అయిన రాశీ ఖన్నా తో గెస్ట్ అప్పీరెన్స్ ఇప్పించాడు. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘ఎఫ్2’ లో రెండో హీరోయిన్ గా నటించిన మెహ్రీన్… అంతకు ముందు ‘రాజా ది గ్రేట్’ లో హీరోయినే..! ఇక జనవరి 11న విడుదల కాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ‘ఎఫ్2’ హీరోయిన్ తమన్నాతో ఓ పాటలో డ్యాన్స్ చేయించాడు. మరి రష్మిక విషయంలో కూడా ఇదే ఫాలో అవుతాడా అనేది చూడాలి.

దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus