ఇప్పటివరకు అపజయమెరుగని దర్శకుడిగా రాజమౌళి (S. S. Rajamouli) మాత్రమే ఉంటే.. ఆ తర్వాత అనిల్ రావిపూడి కూడా ఆ లిస్టులో చేరాడు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) సినిమా అంటే చాలా కాల్యుక్యులేటివ్ గా ఉంటుంది. ఎక్కడ ఏ కామెడీ సీన్ పడాలో, ఎక్కడ హీరో ఎలివేషన్ ఉండాలో, ఎక్కడ యాక్షన్ ఎలిమెంట్స్ ఉండాలో.. ఇవన్నీ కరెక్ట్ మీటర్లో ఉంటాయి. అందుకే అతన్ని టాలీవుడ్ రోహిత్ శెట్టి అంటుంటారు ఇండస్ట్రీ జనాలు. అయితే ఒక్క ఫ్లాప్ కూడా లేకపోయినా, అతని ఖాతాలో 5 రూ.100 కోట్ల సినిమాలు, ఒక్క రూ.300 కోట్ల సినిమా ఉన్నా..
అనిల్ రావిపూడిని విమర్శించే వారి సంఖ్య ఎక్కువే. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. అనిల్ రావిపూడిలో కంటెంట్ కంటే అనవసరమైన కామెడీ ట్రాక్స్ ఎక్కువ ఉంటాయి, హీరో హీరోయిన్స్ మధ్య సరైన లవ్ ట్రాక్స్ ఉండవు.. అక్కడ కూడా కమెడియన్స్ ని పెడతాడు.., అలాగే విలన్- హీరో..మధ్య వచ్చే కాన్ఫ్రన్టేషన్ సీన్స్ దగ్గర కూడా కమెడియన్స్ ని పెట్టి కామెడీ చేస్తాడు..
అతని సినిమాల్లో సీరియస్నెస్ ఉండదు అనే విమర్శలు కూడా అనిల్ పై ఉన్నాయి. చిరంజీవి (Chiranjeevi) వంటి స్టార్ వచ్చి ఛాన్స్ ఇస్తున్నా ..అనిల్ రావిపూడిపై ఈ నెగిటివ్ కామెంట్లు అయితే తగ్గడం లేదు. అందుకే అనిల్ రావిపూడి జోనర్ మార్చాలని డిసైడ్ అయ్యాడట. అది కూడా ఎవ్వరూ ఊహించని జోనర్ అని తెలుస్తుంది. మహాభారతంపై అనిల్ రావిపూడికి మంచి గ్రిప్ ఉంది.
అందులోని ఒక పాత్రని తీసుకుని.. ఫిక్షన్ జోడించి ఒక కమర్షియల్ డ్రామా చేయాలని అనిల్ భావిస్తున్నాడట. త్రివిక్రమ్ (Trivikram) కూడా ప్రస్తుతం అదే చేస్తున్నాడు. అల్లు అర్జున్ తో (Allu Arjun) అతను చేయబోతున్న సినిమాని మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనిల్ కూడా అతని బాటలోనే నడవబోతున్నట్టు టాక్.