దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) సినిమాలు అన్నీ మంచి కమర్షియల్ మీటర్లో ఉంటాయి. ఏ హీరోతో ఎలాంటి సినిమా చేయాలో.. ఆ హీరోల అభిమానుల పల్స్ ఎలా ఉంటుందో పర్ఫెక్ట్ గా అంచనా వేసుకుని.. తన మార్క్ కూడా మిస్ కాకుండా చూసుకుంటాడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) . మహేష్ బాబు (Mahesh Babu) తో మెసేజ్ తో కూడిన కమర్షియల్ సినిమాలు కచ్చితంగా వర్కౌట్ అవుతాయి. ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) అలానే ఉంటుంది. అది అభిమానులను మెప్పించింది.
ప్రస్తుతానికి మహేష్ బాబు (Mahesh Babu) కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ మూవీగా ఉంది. అలాగే వెంకటేష్ కి కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ప్లస్ పాయింట్. ‘ఎఫ్ 2’ (F2) ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam)లో అవి మిస్ అవ్వలేదు. అందుకే వెంకటేష్ (Venkatesh) కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి.
అలాగే బాలకృష్ణ (Balakrishna) సినిమాల్లో మాస్ ఉండాలి. ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్. ఇది కూడా సూపర్ హిట్టే..! ఇలా ప్రతి హీరో ఇమేజ్ విషయంలో అనిల్ కి ఓ క్లారిటీ ఉంది.ప్రస్తుతం చిరంజీవితో ఓ సినిమా చేస్తున్నాడు అనిల్. చిరు (Chiru) కి కూడా మాస్ బాగా ప్లస్. అలాగే సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఆయన సినిమాలు రికార్డులు సృష్టిస్తాయి.
ముఖ్యంగా చైల్డ్ సెంటిమెంట్ ఉంటే ఇక చెప్పనవసరం లేదు. ‘పసివాడి ప్రాణం’ ‘చూడాలని ఉంది’ వంటి సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. ఇప్పుడు అనిల్ (Anil ) – చిరు (Chiru) కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా చైల్డ్ సెంటిమెంట్ ఉంటుందని టీం హింట్ ఇచ్చింది. సంక్రాంతి టైంలో చిరు నుండి ఇలాంటి కమర్షియల్ ఫ్యామిలీ సబ్జెక్ట్ వస్తే తిరుగుండదు కదా.!