సీనియర్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ (Aswani Dutt) .. డేరింగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్. ఆయన విజన్ కూడా చాలా గొప్పగా.. అడ్వాన్స్డ్ గా ఉంటుంది. అందుకే ఇంకా ఆయన నిర్మాణంలో ‘కల్కి 2898 AD’ వంటి సినిమాలు వస్తున్నాయి. అలాగే ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా మాట్లాడటం అశ్వినీదత్ (Aswani Dutt) కు అలవాటు. అవి డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం కష్టంగానే అనిపిస్తాయి.
మొన్నామధ్య ఆయన తన గత సినిమాల గురించి.. ముఖ్యంగా ఫ్లాప్ సినిమాల గురించి ఊహించని సీక్రెట్లు బయటపెట్టారు. ‘జై చిరంజీవ’ (Jai Chiranjeeva) ‘సైనికుడు’ (Sainikudu) ‘శక్తి’ (Shakthi) ‘సారొచ్చారు’ (Sarocharu) వంటి ప్లాప్ సినిమాల టైంలో ఆయన ఫేస్ చేసిన ఛాలెంజెస్, ఆలోచనా విధానం వంటివి ఎలా ఉండేవో వర్ణించారు. అశ్వినీదత్ మాట్లాడుతూ.. ” ‘సైనికుడు’ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు.. అది కచ్చితంగా ఆడదేమో అని మొదటి షెడ్యూల్ నుండే అనిపించింది.
తర్వాత సినిమా రాంగ్ ట్రాక్ లో వెళ్తుంది, కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు.. కొంచెం రిపేర్లు చేసే రిలీజ్ చేద్దాం అని దర్శకుడు గుణశేఖర్, హీరో మహేష్ బాబు (Mahesh Babu) ..లకి చెప్పాను. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. అలానే రిలీజ్ చేశాం. సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. నిర్మాతగా నేను పప్పులో కాలేశాను అని అప్పుడు నాకు గట్టిగా అనిపించింది” అంటూ చెప్పుకొచ్చారు.
‘సైనికుడు’ సినిమా 2006 నవంబర్ 30న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. ‘పోకిరి’ (Pokiri) హైప్ ను క్యాష్ చేసుకోవడానికే ఈ సినిమాని రిలీజ్ చేశారేమో అని అంతా అనుకున్నారు ఆ టైంలో..!