Anil Ravipudi: బోయపాటిని అనిల్ ఫాలో అవుతున్నారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్లలో అనిల్ రావిపూడి కూడా ఒకరు. తన సినిమాలలో ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉండే విధంగా అనిల్ రావిపూడి జాగ్రత్తలు తీసుకుంటారు. సినిమాలను తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కించి తన సినిమాలను నిర్మాతలకు సైతం లాభాలు వచ్చేలా అనిల్ రావిపూడి వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ ఎఫ్3 సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎఫ్2 సినిమాకు సీక్వెల్ కాకపోయినా

ఆ పాత్రలతోనే అనిల్ రావిపూడి సినిమాను తెరకెక్కిస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుండగా వచ్చే ఏడాది ఏప్రిల్ 29వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. బాలయ్య తదుపరి సినిమా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావాడానికి చాలా సమయం పడుతుంది. మరోవైపు అనిల్ రావిపూడి తన శైలికి భిన్నంగా బాలయ్యతో మాస్ సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నారు.

అఖండ సక్సెస్ తో బాలయ్య రేంజ్, మార్కెట్ పెరిగింది. బాలయ్య కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేయాలని అనిల్ రావిపూడి భావిస్తున్నారు. బోయపాటి శ్రీను బాలయ్యను ప్రతి సినిమాలో కొత్తగా చూపించిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి కూడా బాలయ్యను చూపించే విషయంలో బోయపాటి శ్రీనును ఫాలో అయ్యారని సమాచారం. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం. అనిల్ రావిపూడి బాలయ్యతో సినిమా తెరకెక్కించాలంటే తొమ్మిది నెలలు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

బాలయ్య సినిమాల నుంచి ప్రేక్షకులు భారీ యాక్షన్ ను ఆశిస్తారు. అనిల్ రావిపూడి సైతం బాలయ్య కోసం తన శైలిని మార్చుకుంటున్నారు. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ వచ్చే ఏడాది దసరా కానుకగా రిలీజ్ కానుందని సమాచారం. వరుసగా స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తూ బాలయ్య కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. బాలయ్య తర్వాత సినిమాలు కూడా సక్సెస్ సాధిస్తే బాలయ్య మార్కెట్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుంది.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus