Anil Ravipudi: ఆ రికార్డును సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి!

ఇతర రంగాలతో పోల్చి చూస్తే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ తక్కువనే సంగతి తెలిసిందే. ఏడాదికి 100 సినిమాలు విడుదలైతే ఆ సినిమాలలో హిట్టయ్యే సినిమాల సంఖ్య 10 నుంచి 15 మాత్రమే కావడం గమనార్హం. ఇలాంటి ఇండస్ట్రీలో హీరోలు కానీ డైరెక్టర్లు కానీ వరుస విజయాలను సొంతం చేసుకోవడం సాధ్యం కాదు. దర్శకధీరుడు రాజమౌళి మాత్రం వరుస విజయాలను సొంతం చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే అటు ఎన్టీఆర్, ఇటు అనిల్ రావిపూడి డబుల్ హ్యాట్రిక్ సాధించడం గమనార్హం.

టెంపర్ సినిమా నుంచి ఆర్ఆర్అర్ వరకు ఎన్టీఆర్ వరుసగా ఆరు సక్సెస్ లను సొంతం చేసుకున్న సంగతి తేసిందే. ఇటు దర్శకుల జాబితాలో అనిల్ రావిపూడి కూడా వరుసగా ఆరు సక్సెస్ లను సొంతం చేసుకుని వార్తల్లో నిలిచారు. పటాస్ సినిమాతో అనిల్ రావిపూడి దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టారు. తొలి సినిమాతోనే సక్సెస్ ను సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి ఆ తర్వాత సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో విజయాలను అందుకున్నారు.

ఎఫ్3 సినిమాతో అనిల్ సక్సెస్ ను సొంతం చేసుకోగా ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. ఎఫ్2 80 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించగా ఈ సినిమా అంతకు మించి కలెక్షన్లను సాధించాల్సి ఉంది. అనిల్ రావిపూడి రేర్ రికార్డ్ విషయంలో అభిమానులు సైతం చాలా సంతోషంతో ఉన్నారు. అనిల్ రావిపూడి స్టార్ హీరోలతో మరెన్నో సినిమాలను తెరకెక్కించి విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

బాలయ్యకు కూడా అనిల్ రావిపూడి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సెప్టెంబర్ నుంచి బాలయ్య అనిల్ కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. సినిమాసినిమాకు అనిల్ రెమ్యునరేషన్ సైతం పెరుగుతోంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus