Balayya Babu: బాబాయి నవ్వించి దెబ్బ కొట్టాడు.. మరి ఇప్పుడు అబ్బయి?

నందమూరి బాలకృష్ణ కోపంగా చూస్తే బాగుంటాడు. నవ్వితే ఇంకా బాగుంటాడు. ఒకసారి బాలయ్య సినిమాలోని లుక్స్‌ను మైండ్‌లో రివైండ్‌ చేసుకోండి… ఎలా ఉన్నాయి ఆ లుక్స్‌ సూపర్‌ కదా. ఇప్పుడు ఇంకో పని చేద్దాం. బాలయ్య సినిమాల్లో కామెడీ చేసి నవ్విస్తే ఎలా ఉంటుందో ఓ రివైండ్‌ వేసుకోండి. అందులోనూ కేవలం కామెడీ సినిమాల్లోని లుక్‌లే. ఎందుకులెండి అంటారా? నిజమే మరి సీరియస్‌ మూవీస్‌లో బాలకృష్ణ కామెడీ చేస్తే ఓకే కానీ, కేవలం కామెడీ సినిమాలు చేస్తే కష్టమే. ఇది మేం అంటున్నది కాదు. గతంలో బాలకృష్ణ చేసిన సినిమా ఫలితాలే నిదర్శనం.

ఇప్పుడు బాలకృష్ణ వినోదాత్మక చిత్రాల గురించి ప్రస్తావన ఎందుకొచ్చింది అంటే. అనిల్‌ రావిపూడితో త్వరలో మొదలవుతుంది అని చెబుతున్న సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌ అని వార్తలు రావడమే. అనిల్‌ రావిపూడి సినిమా అంటేనే వినోదం పాళ్లు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా ఆయన సినిమాలు చూసి చెప్పిందే. మరి అనిల్‌ స్టైల్‌ వినోదం, బాలయ్య సినిమాలో అంటే ఆలోచించాలి. దీంతో బాలయ్యకు తగ్గ కథ రాసుకుంటే మంచిదేమో బ్రదర్‌ అంటూ నెటిజన్లు అనిల్‌కు సూచిస్తున్నారు.

మరోవైపు గతంలో జరిగిన ఓ ఇన్సిడెంట్‌ను ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. చాలా ఏళ్ల క్రితం ‘భలేవాడివి బాసూ’అనే వినోదాత్మక చిత్రం తీసిన దర్శకుడు అరుణ్‌ ప్రసాద్‌ గుర్తున్నారా? ఆయనకు అనిల్‌కి ఉన్న సంబంధమూ మీకు తెలిసే ఉంటుంది. దీంతో బాలయ్య.. బాబాయితో కలసి చేసినప్పుడు బాక్సాఫీసు దగ్గర నవ్వులు పూయలేదు. ఇప్పుడు కొడుకుతో కలసి బాలయ్య నటిస్తే ఏమువుతుందో అని ఆసక్తి రేగుతోంది. ఏమైనా బాలయ్య నవ్వించి హిట్‌ కొడితే చూడాలనుకునేవారికి అనిల్‌ ఆ ఆశ తీరుస్తాడేమో.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus