‘సరిలేరు నీకెవ్వరు’ లో ‘బిగ్ బాస్2’ డైలాగ్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం జనవరి 11న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో నిన్న ప్రమోషనల్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేతులు మీదుగా ‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ మహేష్ అభిమానులకే కాదు మిగిలిన హీరోలందరి అభిమానుల ప్రశంసలు అందుకుంది. పక్కా సంక్రాంతి సినిమా అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ‘నీకు అర్థమవుతుందా’ అంటూ రష్మిక చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. ట్రైలర్ లో మరో రెండు సార్లు ఇదే డైలాగ్ వినిపిస్తుంది. అయితే ఈ డైలాగ్ తెలుగు ‘బిగ్ బాస్2’ రెఫరెన్సు తో తీసుకున్నాడు అనిల్ రావిపూడి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. విషయం ఏమిటంటే.. తెలుగు ‘బిగ్ బాస్2’ కి ‘రన్నర్ అప్’ గా నిలిచిన సింగర్ గీతా మాధురి.. హౌస్ లో ప్రతీసారి ‘నీకు అర్థమవుతుందా’ అంటూ ఎక్కువ సార్లు తోటి హౌస్ మేట్స్ తో అనేది. అప్పట్లో ఈ డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు ‘ఇదే డైలాగ్ ను .. ‘సరిలేరు నీకెవ్వరు’ లో రష్మిక పాత్రకి వాడేసాడు అనిల్ రావిపూడి’ అంటూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus