Prabhas: ఆ బోల్డ్ బ్యూటీకి ప్రభాస్ సినిమాలో ఛాన్స్ దక్కిందా.. ఏమైందంటే?

స్టార్ హీరో ప్రభాస్ సర్జరీ వల్ల గత కొంతకాలంగా షూటింగ్ లకు దూరంగా ఉన్నారు. త్వరలో ప్రభాస్ మళ్లీ షూటింగ్ లతో బిజీ కానున్నారు. వచ్చే ఏడాది ప్రభాస్ నటించిన రెండు సినిమాలు లేదా మూడు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీ వచ్చే ఏడాది చివర్లో మొదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది.

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కిన యానిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తో ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే. యానిమల్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన తృప్తి డిమ్రీ స్పిరిట్ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. స్పిరిట్ సినిమాలో తృప్తి నిజంగా నటిస్తే మాత్రం ఆమె కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

తృప్తిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా తృప్తి భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. తృప్తి సైతం తన రోల్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తృప్తికి రాబోయే రోజుల్లో టాలీవుడ్ నుంచి ఆఫర్లు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. తృప్తి కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాలి. సోషల్ మీడియాలో మాత్రం తృప్తి (Tripti Dimri) పేరు మారుమ్రోగుతోంది.

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో నటిస్తే ఆ నటీమణుల కెరీర్ మలుపు తిరుగుతుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. సందీప్ సినిమాలలో మెయిన్ హీరోయిన్ కంటే మిగతా నటీమణులకు మంచి పేరు వస్తోంది. యానిమల్ ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. యానిమల్ సినిమాలో రణ్ బీర్ ను పవర్ ఫుల్ గా చూపించిన సందీప్ భవిష్యత్తు సినిమాలలో ఎలా చూపిస్తారో చూడాల్సి ఉంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus