Anirudh Ravichander: అనిరుధ్ లైనప్ లో 12 – ఆదాయం ఎంతో తెలుసా?

  • October 17, 2024 / 05:53 PM IST

ఇండియన్ సినిమా సంగీత దర్శకుల్లో అనిరుధ్ (Anirudh Ravichander) పేరు ప్రస్తుతం టాప్ లిస్టులో ఉంటుందని చెప్పవచ్చు. తమిళ సినిమాలే కాదు, తెలుగులో కూడా అనిరుధ్ క్రేజ్ పెరుగుతూ వస్తోంది. తెలుగులో అనిరుధ్ మ్యూజిక్ అందించిన సినిమాలు బ్లాక్ బస్టర్స్ కావడంతో, అనిరుధ్ తో పని చేయాలని టాప్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఎదురుచూస్తున్నారు.ముఖ్యంగా, అనిరుధ్ కంపోజ్ చేసే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మూవీస్ కి సూపర్ బూస్ట్ గా మారుతున్నాయి. రీసెంట్ గా అనిరుధ్ సంగీతం అందించిన ‘జైలర్’, ‘లియో’, ‘జవాన్’, ‘దేవర’ లాంటి పెద్ద సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలవడంతో, అనిరుధ్ ప్రస్తుతం హై డిమాండ్ లో ఉన్నాడు.

Anirudh Ravichander

ఇప్పుడు అనిరుధ్ కు ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాల లైనప్ ఉందనే చెప్పాలి. ఇక వాటి ద్వారా వచ్చే ఆదాయం కూడా గట్టిగానే ఉంది. ప్రస్తుతం ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కో సినిమాకు 8 నుంచి 12 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. అయితే అన్నిటికీ ఒకేలా కాకుండా బడ్జెట్ ను బట్టి కొన్ని చిన్న సినిమాలకు తక్కువ ఛార్జ్ చేస్తున్నాడట. ఇక అనిరుధ్ లైనప్ లో 12 సినిమాల వరకు ఉన్నాయి.

ప్రస్తుతం అనిరుధ్ ‘కూలీ’ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర 2’, కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ‘ఇండియన్ 3’ కూడా అనిరుధ్ లైనప్ లో ఉన్నాయి. అంతేకాక, అనిరుధ్ బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో కూడా బిజీగా ఉన్నాడు. షారుఖ్ ఖాన్ ‘కింగ్’, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మ్యాజిక్’ వంటి సినిమాలకు కూడా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

ఇదే కాక, నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రాబోయే చిత్రానికి, దళపతి విజయ్ ‘విజయ్ 69’ సినిమాకు, విజయ్ దేవరకొండ ‘VD12’, తమిళ్ లో LIK, విడా మూయర్చి, స్కామ్, కావిన్ సినిమాకు కూడా అనిరుధ్ సంగీత దర్శకుడిగా పనిచేయనున్నాడు. ఇక అనిరుధ్ ఈ సినిమాల ద్వారా దాదాపు 70 నుంచి 80 కోట్ల మధ్యలో ఆదాయం అందుకునే ఛాన్స్ ఉంది.

‘వేట్టయన్’ మొదటి వారం ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus