సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ ‘వేట్టయన్- ది హంటర్’ (Vettaiyan) దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదలైంది. ‘జై భీమ్’ తో ఆకట్టుకున్న టి.జె.జ్ఞానవేల్ (T. J. Gnanavel) డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) , ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil), రానా దగ్గుబాటి (Rana), రావు రమేష్ (Rao Ramesh) కూడా కీలక పాత్రలు పోషించారు. మొదటి రోజు సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఎందుకో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో పెర్ఫార్మ్ చేయడం లేదు.
తమిళంలో పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ వచ్చాయి కానీ తెలుగులో బాగా స్ట్రగుల్ అవుతుంది. దసరా సెలవులను అంతంత మాత్రమే వాడుకున్న ఈ సినిమా (Vettaiyan) ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 3.58 cr |
సీడెడ్ | 1.43 cr |
ఉత్తరాంధ్ర | 1.01 cr |
ఈస్ట్ | 0.47 cr |
వెస్ట్ | 0.39 cr |
గుంటూరు | 0.49 cr |
కృష్ణా | 0.64 cr |
నెల్లూరు | 0.32 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 8.33 cr |
‘వేట్టయన్’ కి రూ.10.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం ఈ సినిమా కేవలం రూ.8.33 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కి మరో రూ.2.67 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో వీకెండ్ ను కి కూడా స్టడీగా రాణిస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకునే ఛాన్స్ ఉంది.