Anirudh Ravichander: దేవిశ్రీప్రసాద్‌ పాటకు అనిరుథ్‌ డ్యాన్సట… ఇదెక్కడి మాస్‌ మామా!

  • October 29, 2024 / 06:38 PM IST

తను నటించే ప్రతి సినిమాలో ఒక్క ఫ్రేమ్‌లో అయినా కనిపించే అలవాటు సంగీత దర్శకులకు ఉంటుంది. ఇప్పటివరకు చాలామంది ఇలా కనిపించి, మెరిపించారు కూడా. కొంతమంది అయితే దీనినో సెంటిమెంట్‌లా పెట్టేసుకున్నారు కూడా. అయితే ఒక సంగీత దర్శకుడి ట్యూన్‌కి, మరో సంగీత దర్శకుడు స్టెప్పులేస్తే.. ఇప్పుడు ‘కోలీవుడ్‌’ మోస్ట్‌ హ్యాపెనింగ్ సినిమాలో ఇదే జరిగింది అని చెబుతున్నారు. ఆ సినిమానే ‘కంగువ’.సూర్య (Suriya) – శివ (Siva) కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ చిత్రం ‘కంగువ’ (Kanguva).

Anirudh Ravichander

పాన్‌ ఇండియా లెవల్‌లో నవంబర్ 14 విడుదల కాబోతున్న ఈ సినిమా మీద భారీ స్థాయిలో అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాలో ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) స్పెషల్ క్యామియో చేశారని వార్తలొస్తున్నాయి. సాధారణంగా తను సంగీత దర్శకత్వం వహించే పాటల్లో కనిపించడం అనికి అలవాటే. దాదాపుగా అన్ని సినిమాల్లోనూ అదే చేశారు. ఇప్పుడు వేరే సినిమాలో నటించారు.‘కంగువ’ సినిమాలో ‘యోలో..’ పాటలో అనిరుథ్‌ కాసేపు కనిపిస్తాడని అంటున్నారు.

మరికొంతమందేమో కాసేపు కాదు, వచ్చి రెండు స్టెప్పులేశారు అని కూడా చెబుతున్నారు. గోవాలో జరిగిన షూటింగ్‌లో అనిరుథ్‌ పాల్గొన్నాడని, ఆ స్టెప్స్‌ / సీన్స్‌ అదిరిపోతాయని అంటున్నారు. మరి నిజంగానే అనిరుథ్‌ ‘కంగువ’ సినిమాలో నటించాడా? పాటలో స్టెప్పులేశాడా అనేది చూడాలి. ఒకవేళ చేసి ఉంటే అద్భుతమే అని చెప్పాలి. ఎందుకంటే కోలీవుడ్‌, టాలీవుడ్‌లో స్టార్‌ మ్యూజిక్‌ కంపోజర్‌గా అనిరుథ్‌ ఉన్నాడు. ఈ సమయంలో వేరే మ్యూజిక్‌ డైరక్టర్‌, అందులోనూ తనతో పోటీ పడుతున్న మ్యూజిక్‌ డైరక్టర్‌ ట్యూన్‌కు స్టెప్పులేయడం అంటే మామూలు విషయం కాదు.

హీరో సూర్య, దర్శకుడు శివ రిక్వెస్ట్‌తోనే అనిరుథ్‌ నటించాడు అని తెలుస్తోంది. చూద్దాం సినిమా రిలీజ్‌ లోపు ఇంటర్వ్యూల్లో ఈ విషయంలో ఇంకేమైనా క్లారిటీ వస్తుందేమో. ఇక సినిమా సంగతి చూస్తే దిశా పటానీ(Disha Patani)   హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్‌ (Bobby Deol)  విలన్‌. అన్నట్లు ఈ సినిమాకు రూ. 2000 కోట్లు వసూళ్లు వస్తాయని నిర్మాత జ్ఞానవేల్  (K. E. Gnanavel Raja) అంటున్నారు.

‘మీటూ’ ఉద్యమంలో ఇదో కొత్త పేజీ.. అంత ధైర్యం ఉంటే కొట్టేవాడినంటూ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus