కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అందరికీ సుపరిచితమే. ఇప్పుడిప్పుడే తెలుగులో కూడా పాపులర్ అవుతున్నాడు. ఇదిలా ఉండగా.. అనిరుధ్ ఇంట్లో విషాదం చోటు చేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. ఆయన తాత గారు ఎస్వీ రమణన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు కాబట్టి వయసు భారం, అనారోగ్య సమస్యల వల్ల ఆయన కన్నుమూసినట్టు స్పష్టమవుతుంది. అయితే అనిరుధ్ కు తన తాతగారు అంటే చాలా ఇష్టం. ఆయన కూడా సినీ బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారే..!
రేడియో డబ్బింగ్ ఆర్టిస్ట్, దర్శకుడిగా ఆయన గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన తండ్రి సుబ్రహ్మణ్యం.. 1930, 1940 లలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన సందర్భాలు ఉన్నాయి.అలాగే రమణన్.. రేడియోలో వేలాది కార్యక్రమాలకు డబ్బింగ్ చెప్తుండేవారు. పలు షార్ట్ ఫిలిమ్స్ ను కూడా చిత్రీకరించారు. భక్తిరస డాక్యుమెంటరీలు సైతం ఆయన రూపొందించారు. 1983లో రమణన్ దర్శకత్వం వహించిన ‘ఊరువంగల్ మరాళం’ చిత్రంలో మహేంద్రన్, సుహాసిని హీరో హీరోయిన్లుగా నటించగా..
స్టార్ హీరోలు కమల్ హాసన్, రజనీకాంత్.. అతిథి పాత్రల్లో నటించారు. రమణన్ కి ఇద్దరు కుమార్తెలు లక్ష్మీ, పార్వతి ఉన్నారు. లక్ష్మీ కుమారుడే మన అనిరుధ్ . తాత మరణించడంతో అనిరుధ్ చాలా డిజప్పాయింట్మెంట్ కు గురయ్యాడు.అతని ఫ్యామిలీ కూడా విషాదంలో కూరుకుపోయింది. అనిరుధ్ సంగీత దర్శకుడిగా మారడం వెనుక అతని తాతగారి ఎంకరేజ్మెంట్ చాలా ఉందట. ఈ విషయాన్ని గుర్తు చేసుకుని మరీ అతను బాధపడుతున్నట్టు తెలుస్తుంది.
Most Recommended Video
అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!