బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం నేటితో ఐదు వారాలను పూర్తి చేసుకుంటుంది. ఈ కార్యక్రమంలోకి నేడు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరి కొంత మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అందులో అంజలి పవన్ కూడా ఒకరు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈమె ఎపిసోడ్ ప్రారంభం రోజే ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనాల్సి ఉండేదని కానీ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా రాబోతుంది అంటూ వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వార్తలపై అంజలి పవన్ స్పందించారు.
ఈ సందర్భంగా బిగ్ బాస్ ఎంట్రీ గురించి ఈమె (Anjali Pavan) ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఇందులో భాగంగా ఈమె మాట్లాడుతూ తనని బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా పాల్గొనమని అవకాశం కల్పించారు అయితే నాకు చిన్నతనం నుంచి అమ్మని విడిచిపెట్టి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు ఇప్పుడు పవన్ ను కూడా విడిచిపెట్టి ఎక్కువ రోజులు ఎక్కడికి వెళ్లిన సందర్భాలు లేవు ఇక ధన్విక పుట్టిన తర్వాత తనే నా ప్రపంచం అయిందని తెలిపారు.
ఒకవేళ నేను బిగ్ బాస్ హౌస్ కి వెళ్తే తను నాపై బెంగ పెట్టుకుంటుందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం తన కూతురిపై చాలా బెంగ ఉంటుందని అందుకే బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాలా వద్దా అని చాలా ఆలోచించి వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.. ఇకపోతే వైల్డ్ కార్డు ద్వారా కూడా హౌస్ లోకి వెళ్లే అవకాశం తనకు కల్పించారు కానీ ఈ విషయం గురించి బాగా ఆలోచించి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను.
ఈ విషయం గురించి ఇంట్లో వారితో డిస్కస్ చేయగా అక్కడ ఎన్ని రోజులు ఉంటానో తెలియదు ఎప్పుడు బయటకు వస్తాను కూడా తెలియదు. ఈ కొద్ది రోజులకు వెళ్లి నెగిటివ్ అవడం అవసరమా అనిపించింది అందుకే వెళ్లలేదని ప్రస్తుతానికైతే ఈ సీజన్ చాన్స్ మిస్ చేసుకున్నానని భవిష్యత్తులో తన ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్పలేను అంటూ అంజలి పవన్ బిగ్ బాస్ ఎంట్రీ గురించి ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు