టాలీవుడ్ నన్ను పట్టించుకోవడం లేదు : అంజలి

తెలుగు అమ్మాయి అయిన అంజలి కోలీవుడ్ మీదుగా టాలీవుడ్ లోకి వచ్చింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి వంటి విజయాలు అందుకుంది. సరైనోడు’లో ‘బ్లాకు బస్టరే…’ పాటలో అదరగొట్టింది. ఆ తర్వాత కోలీవుడ్ కే పరిమితమైంది. కాళి, కన్బదు పోయ్, నాదోడిగల్ 2 సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ మధ్య ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమెను.. తెలుగు సినిమాలు ఎందుకు చేయడం లేదు అడిగేతే.. ఆవేశపడిపోయింది. తాను నటించడానికి ఎప్పుడూ రెడీనే.. తెలుగు దర్శకనిర్మాతలే తనని పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేసింది. “మాతృ భాషలో నటించడం నాకు ఇష్టం.

ఇక్కడ మంచి హిట్స్ అందుకున్నప్పటికీ.. మంచి నటిగా పేరు తెచుకున్నప్పటికీ అవకాశాలు రావడం లేదు. కోలీవుడ్ నుంచి వరుసగా ఆఫర్లు రావడంతో అటే ఉండిపోయాను” అని అంజలి స్పష్టం చేసింది. బరువు తగ్గడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తే ఇలా స్పందించింది. “సినిమాల కోసం కాదు. నాకోసం నేను మారాను. ఈ మధ్య కాలంలో కొద్దిగా బొద్దుగా మారాను. నా ఫిజిక్‌ నాకే ఇబ్బందిగా అనిపించింది. అందుకే ప్రత్యేకంగా ట్రైనర్‌ని పెట్టుకుని మరీ సన్నపడ్డాను. నేను సన్నపడిన తర్వాత అవకాశాలు పెరిగాయి” అని అంజలి చెప్పింది. ఇప్పటికైనా టాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఆమెను పట్టించుకుంటారో లేదో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus