`నిశ్శ‌బ్దం`లో అంజ‌లి లుక్ విడుద‌ల‌!

అభిన‌యంతో పాటు గ్లామ‌ర్ పాత్ర‌ల్లో న‌టిస్తూ హీరోయిన్‌గా త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్ అంజ‌లి. తాజాగా ఈమె `నిశ్శ‌బ్దం` చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమాకు అంజ‌లి లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న క్రాస్ ఓవ‌ర్ చిత్రం `నిశ్శ‌బ్దం`. సాక్షి అనే అమ్మాయిగా అనుష్క వైవిధ్య‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇటీవ‌ల ఆమె పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అలాగే సినిమాలో మ‌రో ప్ర‌ధాన పాత్రధారి మాధ‌వ‌న్ లుక్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. రీసెంట్‌గా సినిమా ప్రీ టీజ‌ర్ కూడా విడుద‌లై మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలో సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న అంజ‌లి లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.


మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus