నిశ్శబ్ధం సినిమా కోసం డిఫరెంట్ రోల్ ప్లే చేసిన అంజలి

అగ్ర కథానాయిక స్థానం కోసం ఆరాటపడకపోయినా.. టాలీవుడ్ స్టార్ హీరోస్ అయిన బాలకృష్ణ, వెంకటేష్ ల సరసన నటించి అందుకోసం తపించిన తెలుగమ్మాయి అంజలి. అందరు తెలుగమ్మాయిల్లానే అంజలికి కూడా తొలుత తెలుగులో సరైన ఆదరణ లభించలేదు. తమిళంలో వరుస విజయాలతోపాటు నటిగాను తనను తాను ప్రూవ్ చేసుకొన్న తర్వాత అంజలికి తెలుగులో ఆఫర్లు రావడం మొదలైంది. అయితే.. తదనంతరం అమ్మడు లుక్స్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో జూనియర్ నమితలా తయారయ్యింది. దాంతో అమ్మడిని తెలుగు-తమిళ భాషల ఫిలిమ్ మేకర్స్ పట్టించుకోవడం మానేశారు.

అందుకే.. ఈమధ్య కాస్త కష్టపడి బాగా తగ్గిన అంజలి గ్లామర్ రోల్స్ కాకుండా పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తూ తన కెరీర్ ను సెట్ చేసుకొంటోంది. మమ్ముట్టితో నటించిన “పెరంబు” అంజలికి మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు అదే తరహాలో తన చిరకాల మిత్రుడు కోన వెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న “నిశ్శబ్ధం” సినిమాలోనూ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది అంజలి. ఈ సినిమాలో ఆమె పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది. ఈ పాత్ర కోసం ఆమె బరువు తగ్గడమే కాకుండా యాక్షన్ సీక్వెన్స్ లలోనూ పాల్గొనడం విశేషం. మరి అంజలిని అమెరికన్ పోలీస్ పాత్రలో చూడగలమా? అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఆ రోల్ కు అంజలి ఎలా న్యాయం చేసిందో తెలియాలంటే జనవరి 24 వరకూ వెయిట్ చేయాల్సిందే.

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus