సీనియర్ నటుడు సునీల్ షిండే మృతి..!

  • November 15, 2022 / 06:30 PM IST

సినిమా ఇండస్ట్రీని గతకొద్ది రోజులుగా వరుస విషాదాలు వెంటాడుతున్నాయి.. రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం తర్వాత పలు భాషలకు చెందిన సినీ ప్రముఖులు కన్నుమూశారనే వార్తలతో ఆయాా పరిశ్రమల వాళ్లు ఉలిక్కిపడుతున్నారు. సీరియల్ నటి విష్ణు ప్రియ తన తండ్రి మృతి చెందారనే విషయాన్ని వెల్లడించింది. అంతలోనే.. పాపులర్ క్యారెక్టర్ యాక్టర్, సీనియర్ జర్నలిస్ట్ డీఎంకే మురళి మరణించారనే వార్తతో సినీ పరిశ్రమతో పాటు మీడియా వర్గాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి..

ఇక నవంబర్ 15 తెల్లవారు జామున సూపర్ స్టార్ కృష్ణ గారు ఇకలేరనే వార్త అందర్నీ కలవరపాటుకి గురిచేసింది.. ఆ షాక్‌లో ఉండగానే మరో సీనియర్ నటుడు మరణించారని తెలిసింది.. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీల్ షిండే కన్నుమూశారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. హిందీ చిత్రసీమలో 70, 80ల దశకాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందిన సునీల్ షిండే సోమవారం (నవంబర్ 14)న రాత్రి 1 గంట సమయంలో ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారని,

అదే రోజు మధ్యాహ్నం పార్శీవాడలోని హిందూ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయని.. సునీల్ షిండే సన్నిహితుడు, సినీ విమర్శకుడు పవన్ ఝా మీడియాకు తెలిపారు. అయితే సునీల్ మృతికి గల కచ్చితమైన కారణాలు ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియలేదని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. దాదాపు 30 ఏళ్లపాటు నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగిన సునీల్ షిండే.. కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు..

‘సర్కస్’, ‘సర్ఫరోష్’, ‘శాంతి’ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు సంపాదించుకున్నారు. ‘గాంధీ’, ‘ఖల్ నాయక్’, ‘ఘయాల్’, ‘జిద్ది’, ‘దౌడ్’, ‘మగన్’ మరియు ‘విరుద్ధ్’ లాంటి సూపర్ హిట్ ఫిల్మ్స్‌లో సహాయక, పోలీస్, పొలిటిషియన్ లాంటి విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులకు ఆకట్టుకున్నారు. సునీల్ షిండే మరణవార్తతో బాలీవుడ్ వర్గాలవారు దిగ్భ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియా ద్వారా సునీల్ షిండే ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. నివాళులర్పిస్తున్నారు

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus