Ram Charan: మరో బాలీవుడ్‌ పాటకు చరణ్‌ స్టెప్పులు.. ఇంతకుముందుది గుర్తుందా?

ఎంత స్టార్‌ హీరో అయినా.. అతని కంటూ ఓ స్టార్‌ హీరో ఫేవరెట్‌గా ఉంటారు కదా. ఆ హీరో పాటలకు డ్యాన్స్‌ కూడా వేసి ఉంటారు కదా. మళ్లీ ఛాన్స్‌ వస్తే మరోసారి డ్యాన్స్‌ వేయడానికి కూడా రెడీగా ఉంటారు కదా. అచ్చంగా గత కొన్ని రోజుల నుండి ఇదే జరుగుతోంది. ఇక్కడ స్టార్‌ హీరో రామ్‌చరణ్‌ అయితే, ఫేవరెట్‌ హీరో అక్షయ్‌ కుమార్. ఇప్పటికే అర్థమైపోయుంటుంది. మేం ఏ విషయం గురించి చెప్పబోతున్నామో.

ఇటీవల రామ్‌చరణ్‌ కొత్త వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ గణేశ్‌ ఆచార్య, రామ్‌చరణ్‌ కలసి ఓ పాటకు స్టెప్పులేశారు. ఆ పాట రామ్‌చరణ్‌ది కాదు, అలా అని చిరంజీవిది కూడా కాదు. మరెవరిది అంటున్నారు. ఇంకెవరు బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ది. అతని సినిమా ‘మై ఖిలాడీ తూ అనారి’ సినిమా టైటిల్‌ సాంగ్‌కి డ్యాన్స్‌ వేశారు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో ఇప్పుడు వైరల్‌ అయ్యింది.

అంతేకాదు ఆ వీడియోకు అక్షయ్‌ కుమార్‌ కూడా స్పందించాడు. చరణ్‌ డ్యాన్స్‌ అదరగొట్టేశాడు అంటూ ఆనందపడిపోయాడు కూడా. బాలీవుడ్‌ ఫేమస్‌ సాంగ్‌కి, మోస్ట్‌ ఫేమస్‌ కొరియోగ్రాఫర్‌ గణేశ్‌ ఆచార్యతో డ్యాన్స్‌ చేస్తున్నాడు అంటూ ఫ్యాన్స్‌ ఆనందపడిపోతున్నారు. అయితే అక్షయ్‌ కుమార్‌ పాటలకు రామ్‌చరణ్‌ డ్యాన్స్‌ వేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఓసారి రెండు పాటలకు డ్యాన్స్‌లు వేశాడు చరణ్‌. అయితే అప్పుడు అక్షయ్‌ కుమార్‌తో కలిసే స్టెప్పులేశాడు.

ఓ కార్యక్రమంలో భాగంగా అక్షయ్‌ను కలిసి చరణ్‌ ‘టిప్‌ టిప్‌ బర్సా పానీ’, ‘తూ చీజ్‌ బడీ హై మస్త్‌ మస్త్‌’ అనే పాటలకు అక్షయ్‌తో కలసి డ్యాన్స్‌ వేశాడు. ఈ మొత్తం డ్యాన్స్‌లు, వైరల్‌ వీడియోలు చూసి.. అక్షయ్‌ అంటే రామ్‌ చరణ్‌కు అంత అభిమానమా అని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఇలాంటి డ్యాన్స్‌లు మరిన్ని చూసే అవకాశం ఉంది అనిపిస్తోంది.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus