దేశంలో కరోనా తెచ్చిన మార్పుల సంగతి పక్కనపెడితే… సినిమా రంగంలో మాత్రం చాలా మార్పులు తీసుకొచ్చింది. అందులో ఒకటి ఓటీటీ. అప్పటికే దేశంలోకి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఎంటర్ అయిపోయినా… కరోనా సమయంలో జనాలు బాగా ఓటీటీలకు అలవాటుపడ్డారు. దీంతో మన నిర్మాణ సంస్థలు కూడా ఓటీటీల వైపు దృష్టి సారిస్తున్నాయి. తాజాగా ఓ అగ్ర నిర్మాణ సంస్థ ఓటీటీపై భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతోంది. బాలీవుడ్‌లో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థల్లో యశ్‌రాజ్ ఒకటి.
50 ఏళ్ల క్రితం అంటే 1970లో ఈ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేశారు. అప్పటి నుండి తమదైన శైలిలో భారీ చిత్రాలు, కాన్సెప్ట్ చిత్రాలు రూపొందిస్తూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త తరం కథలు, కథకులు, నటులను ఇండస్ట్రీకి తీసుకొస్తోంది. తాజాగా ఓటీటీలోకి కూడా రావాలని చూస్తోందట. దీని కోసం ₹500 కోట్లు కేటాయిస్తోందట. అయితే కొత్తగా ఓటీటీని తీసుకొస్తారా? లేక సినిమాల నిర్మాణానికే ఈ బడ్జెట్టా అనేది తెలియాలి. నిర్మాత ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్‌తో…
ఈ భారీ ప్రణాళిక రచిస్తున్నట్టు బాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ప్రపంచ స్థాయి ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని… సినిమా ప్రపంచంలో ఓటీటీ సినిమాలు రూపొందిస్తాం. భారతీయ మూలాలున్న కథల్ని తీసుకురావాలనేదే యశ్‌రాజ్ ఆలోచన. అది తెర అయినా, ఓటీటీ అయినా. దాని కోసం భారీ స్థాయిలో సన్నాహాలు జరుగుతున్నాయి అని యశ్‌రాజ్ వర్గాలు చెబుతున్నాయట.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!