‘పుష్ప’ సినిమాకి మరో దెబ్బ పడింది.. మళ్ళీ మొదటికి వచ్చింది..!

ఈ ఏడాది సంక్రాంతికి ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నాడు అల్లు అర్జున్. ఆ చిత్రం విజయం ఇచ్చిన ఊపుతో సుకుమార్ డైరెక్షన్లో ‘పుష్ప’ అనే పాన్ ఇండియా చిత్రం చెయ్యడానికి రెడీ అయ్యాడు. నిజానికి మార్చిలో మొదలు కావాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల మొదలుకాలేదు. లాక్ డౌన్లో మ్యూజిక్ సిట్టింగ్స్ వేశారు. ఆ వర్క్ చాలా వరకూ కంప్లీట్ చేసారని తెలుస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం షూటింగ్లకు పర్మిషన్ ఇచ్చేసింది.

అన్ని సినిమాల షూటింగ్లు మొదలైపోతున్నాయి. ప్రభాస్ అయితే ఏకంగా ‘రాధే శ్యామ్’ షూటింగ్ కోసం ఇటలీ కూడా వెళ్ళిపోయాడు. రేపో మాపో మహేష్ బాబు కూడా అమెరికా వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. ఇక చిరంజీవి ‘ఆచార్య’,పవన్ ‘వకీల్ సాబ్’, రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి బడా చిత్రాల షూటింగ్లు కూడా మొదలైపోతున్నాయి. కానీ ‘పుష్ప’ విషయమే ఇంకా తేలడం లేదు. ఇది పూర్తిగా అడవుల బ్యాక్ డ్రాప్ లో సాగే కథ. దాంతో కచ్చితంగా దట్టమైన అడవుల ప్రాంతంలోనే ఈ చిత్రం షూటింగ్ చెయ్యాల్సి ఉంది. అందుకే మొదట.. ఈ చిత్రం షూటింగ్ కేరళలో ప్లాన్ చేసారు.

అయితే మొదటి కరోనా కేసు అక్కడే నమోదయ్యింది కాబట్టి.. అలాగే కరోనా విజృంభణ అక్కడ ఊపందుకుంది కాబట్టి అక్కడ క్యాన్సిల్ చేసి … వికారాబాద్ , రంపచోడవరం వంటి లొకేషన్లలో ప్లాన్ చేశారు. తరువాత ఇక్కడ కూడా కరోనా తాకిడి ఎక్కువవ్వడం అలాగే లాక్ డౌన్ కూడా మొదలవ్వడంతో ఇక్కడ కూడా షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది. సరే కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుని మళ్ళీ కేరళ వెళదాం అనుకుంటే.. ఈమధ్య అక్కడ కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. దీంతో ‘పుష్ప’ టీం అయోమయంలో ఉన్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

కాబోయే భర్తతో కాజల్… వైరల్ అవుతున్న రేర్ ఫోటోస్!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్‌’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus