బ్రదర్స్ ఇద్దరూ కలిసి వస్తున్నారా..!

టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీస్టారర్స్ హవా కొనసాగుతోంది. ఎన్టీఆర్ – రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ – రానా, మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్, ఇలా ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ టైమ్ లో మరో మల్టీస్టారర్ కి తెరలేపుతోంది గీతాఆర్ట్స్ బ్యానర్. ఒకరు స్టైలిష్ స్టార్ అయితే, ఇంకొకరు రౌడీ స్టార్. ఇద్దరి కాంబోలో అతి త్వరలోనే సినిమాని ఎనౌన్స్ చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. నిజానికి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉండబోతోందని లాస్ట్ ఇయర్ రూమర్స్ కూడా వినిపించాయి. అయితే, ప్రస్తుతం మహేష్ వి రాఘవన్ డైరక్షన్ లో ఈసినిమా తెరకెక్కనుందని జోరుగా ప్రచారం సాగుతోంది.

సోషల్ మీడియాలో ఇద్దరి ఫోటోలు పెట్టి ఫ్యాన్స్ ఈ న్యూస్ ని తెగ షేర్లు చేస్తున్నారు. ఈ సినిమాకి నిర్మాత ఎవరో కాదు అల్లు అరవిందే అంటున్నారు. గీతాఆర్స్ట్ 2 బ్యానర్ లో ఈసినిమాని నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండల మధ్య ఉన్న రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిజానికి గీతాగోవిందం సినిమా మొదట బన్నీదగ్గరికే వస్తే ఆ కథ విజయ్ కే సెట్ అవుతుందని చెప్పి డైరెక్టర్ పరుశురామ్ కి సలహా ఇచ్చింది బన్నీనే. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. బన్నీకి, రౌడీ కి మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. ఎప్పట్నుంచో బన్నీతో కలిసి సినిమా చేయాలని చూస్తున్నాడు మన విజయ్ దేవరకొండ.

అందుకే ఇప్పుడు వీరిద్దరి కాంబోలో సినిమా ఫిక్స్ అయినట్లుగానే చెప్తున్నారు సినీ తమ్ముళ్లు. ఇక ఈ సంవత్సరం చివర్లో సినిమా స్టార్ట్ కాబోతోందట. పుష్ప సినిమా తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో బన్నీ మరో సినిమాకి కమిట్ అయ్యాడు. ఆ తర్వాత వేణుశ్రీరామ్ తో కూడా ఐకాన్ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు విజయ్ తో కలిసి ఈ మల్టీస్టారర్ కి శ్రీకారం చుట్టాడనే చెప్తున్నారు. ఈ ఇయర్ లాస్ట్ లో సినిమా ఉంటుందని, త్వరలోనే ఎనౌన్స్ చేస్తారని టాక్. మరోవైపు విజయ్ కూడా పూరీ అండ్ టీమ్ తో లైగర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అదీ మేటర్.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus