Game Changer: ఇంతమంది దర్శకులు ఒక్క ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అవ్వడం ఇదే మొదటిసారేమో!

ఒక సినిమాకి డైరెక్షన్ టీమ్ ఉంటారు. సినిమాలోని కొన్ని షాట్స్ ను దర్శకుడు కాకుండా డైరెక్షన్ టీమ్ లోని సీనియర్ తో తీయిస్తారు. ఒక్కోసారి దర్శకుడికి ఒంట్లో బాలేక లేదా పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నప్పుడో ఈ డైరెక్షన్ టీమ్ లో సీనియర్స్ సినిమాను హ్యాండిల్ చేయడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. రామ్ చరణ్ (Ram Charan)  “గేమ్ ఛేంజర్” (Game Changer)   సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది. అయితే.. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సినిమా టీమ్ మెంబర్ కాకుండా, వేరే దర్శకుడు హ్యాండిల్ చేయడం.

Game Changer

మొన్నటివరకు “గేమ్ ఛేంజర్” సెకండ్ యూనిట్ వర్క్ మొత్తం శైలేష్ కొలను హ్యాండిల్ చేశాడు, ఆ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశాడు కూడా. అయితే.. ఇప్పుడు శైలేష్ కొలను  (Sailesh Kolanu)  “హిట్ 3” వర్క్ లో బిజీగా ఉండడంతో, సినిమాలోని కొన్ని సీన్స్ ను హ్యాండిల్ చేయడానికి, ముఖ్యంగా సెకండ్ యూనిట్ ను మ్యానేజ్ చేయడానికి సుధీర్ వర్మ (Sudheer Varma) రంగంలోకి దిగాడని తెలుస్తోంది. అందుకు కారణం శంకర్ (Shankar) ప్రస్తుతం చెన్నైలో “గేమ్ ఛేంజర్” పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడంట.

అందుకే ప్రస్తుతం హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో జరుగుతున్న “గేమ్ ఛేంజర్” షూటింగ్ వర్క్ ను సుధీర్ వర్మ పర్యవేక్షిస్తున్నాడు. అలాగే.. విజయవాడలో జరుగుతున్న మెయిన్ & చివరి షెడ్యూల్ ను శంకర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు. ఈ రెండు షెడ్యూల్స్ తో షూటింగ్ పూర్తవుతుంది. ఈ షెడ్యూల్స్ లో ఎస్.జె.సూర్య(SJ Suryah), శ్రీకాంత్ (Srikanth) తదితర క్యాస్టింగ్ పాల్గంటున్నారు.

అయితే.. సరైన హిట్ లేక ఢీలాపడిన సుధీర్ వర్మ లాంటి దర్శకుడు “గేమ్ ఛేంజర్” లాంటి ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే.. ఇప్పటివరకు ఓ భారీ సినిమా కోసం ఇంతమంది దర్శకుడు పని చేయడం కూడా ఇదే మొదటిసారి. మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ.. ఇంతమంది కలిసి కలగాపులగం చేస్తారేమో అని భయపడుతున్నారు మెగా ఫ్యాన్స్.

మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘కంగువా’!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus