Bollywood: ఇక్కడే తేడా కొట్టింది అనుకుంటే.. అక్కడకి తీసుకెళ్లి ఇంకా ఇబ్బందిపడ్డారు!

  • April 10, 2023 / 06:32 PM IST

కరోనా – లాక్‌డౌన్‌ తదితర పరిస్థితుల నేపథ్యంలో బాలీవుడ్‌ తిరిగి పూర్వపు ఫామ్‌లోకి రావడానికి చాలా ఇబ్బందిపడుతోంది. ఎన్ని రకాల సినిమాలు వస్తున్నా సరైన విజయం అందుకోవడం లేదు. అప్పటి నుండి ఇప్పటివరకు సరైన విజయం దక్కించుకున్నది మూడు, నాలుగు సినిమాలే. అయితే ఆ విజయాలు మిగిలిన వాళ్లకు అవసరమైన బూస్టింగ్‌ ఇవ్వలేకపోతున్నాయా.. వరుస ఫలితాలు చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. అంతేకాదు ఇక్కడ మరో విషయం కూడా తేలిపోయింది. అదే సౌత్‌ ఫార్ములా బాలీవుడ్‌లో బెస్ట్‌ ఫార్ములా అని చెప్పలేము అని.

ఇటీవల కాలంలో సౌత్‌ సినిమాలు పాన్‌ ఇండియా సినిమాలుగా అక్కడకు వెళ్లి విజయాలు అందుకున్నాయి. దీంతో సౌత్‌ కథలను అక్కడివాళ్లు బాగా ఆదరిస్తారు అనుకుని కథల్ని అమాంతం కొనుక్కెళ్తున్నారు అక్కడివాళ్లు. కానీ మీ కథలన్నీ మాకు నచ్చవు అని చెబుతున్నారు బాలీవుడ్‌ ప్రేక్షకులు. దానికి తాజా ఉదాహరణే.. ‘గుమ్రా’. ఆదిత్య రాయ్‌ కపూర్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా సరైన ఫలితం అందుకోలేకపోయింది.

తమిళంలో ‘తడమ్‌’గా రూపొంది.. తెలుగులో ‘రెడ్‌’గా వచ్చిన సినిమాకు రీమేక్‌ ఈ ‘గుమ్రా’. తమిళంలో మంచి విజయం అందుకున్నా.. తెలుగులో తేడా కొట్టిన సినిమా ఇది. ఇప్పుడు హిందీలో కూడా తేడా కొట్టేసింది. తమిళంలో ఉన్న కథను తీసుకున్నారు కానీ.. అక్కడి ఎమోషన్‌ను కవర్‌ చేయలేకపోయారు అని అంటున్నారు. దీంతో సరైన వసూళ్లు దక్కడం లేదు అని చెబుతున్నారు. అంతేకాదు మన కథలను బాలీవుడ్‌ భుజానికెత్తుకోదు అని అర్థమైంది అని అంటున్నారు.

ఇటీవల బాలీవుడ్‌లో (Bollywood) వచ్చిన చాలా సౌత్‌ రీమేక్‌లు తేడా కొడుతున్నాయి. త్రివిక్రమ్‌ బ్లాక్‌బస్టర్‌ ‘అల వైకుంఠపురములో..’ రీమేక్‌ ‘షెహజాదా’, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’ రీమేక్‌ అయిన ‘సెల్ఫీ’ కూడా బాలీవుడ్‌లో ఆకట్టుకోలేకపోయింది. ‘దృశ్యం 2’ అయితే మంచి విజయం అందుకుంది. దీంతో బాలీవుడ్‌ జనాలు ఎలాంటి కథల విషయంలో ఆసక్తిచూపిస్తున్నారో తెలియడం లేదు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus