టాలీవుడ్‌లో మరో స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ

సినిమాలు, క్రీడలు… ఈ రెండూ కవలలు లాంటివి అనిపిస్తుంటుంది ఒక్కోసారి. ఎందుకంటే క్రీడలు, క్రీడాకారుల నేపథ్యంలో సినిమాలు వస్తూనే ఉంటాయి. బాలీవుడ్‌లో ఎక్కువగా, టాలీవుడ్‌లో తక్కువగా వస్తుంటాయి ఈ క్రీడా నేపథ్య చిత్రాలు. అయితే ఇటీవల కాలంలో వీటి జోరు పెరిగిందనే చెప్పొచ్చు. మొన్నీ మధ్య ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ వచ్చిన విషయం మనకు తెలిసింది. హాకీ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు కబడ్డీ నేపథ్యంలో సినిమా రాబోతోంది.

మొత్తం కొత్తవాళ్లతో కబడ్డీ నేపథ్యంలో ‘అర్జున్‌ చక్రవర్తి’ అనే సినిమా తెరకెక్కుతోంది. కొత్త కుర్రాడు వేణు కేసీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్‌ రామరాజు, సిజా రోజ్‌ ప్రధాన పాత్రధారులు. చరిత్రలో తనకంటూ ఓ పేజీ లేని ప్రముఖ కబడ్డీ క్రీడాకారుడి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోందట. ఈ సినిమాను తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత హిందీ, మలయాళం, కన్నడలోకి డబ్బింగ్‌ చేసి పాన్‌ ఇండియా రిలీజ్‌ చేయాలని చూస్తున్నారట.

రెండేళ్ల క్రితం ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభిచారట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జమ్ము కశ్మీర్‌ సహా మొత్తంగా దేశంలో 125 ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణ జరిపారట. ఈ సినిమాలో హీరోగా ఏడు రకాల మేకోవర్‌తో కనిపిస్తాడట. అంటే చిన్న పిల్లాడి నుండి మధ్య వయస్కుడి వరకు అన్నీ ఒకడే నటించాడట. ఈ సినిమా కోసం 1960, 80ల నాటి పరిస్థితులు కనిపించేలా సెట్స్‌ కూడా వేశారట.

Most Recommended Video

ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!
ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళే..!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus