Devara: వామ్మో.. దేవర 2లో మరో బాలీవుడ్ స్టారా?

దేవర 2 (Devara)  పై ఇప్పటి నుంచే రకరకాల గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. మొదటి భాగానికి మిక్స్ డ్ రెస్పాన్స్ రావడంతో, రెండో పార్ట్ ఉంటుందా లేదా అన్న అనుమానాలు ఫ్యాన్స్‌లో బలంగా ఉన్నాయి. దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) మాత్రం సీక్వెల్‌పై స్ట్రాంగ్‌గా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అయితే ఈసారి మరింత గట్టిగా హిందీ మార్కెట్‌పై దృష్టిపెట్టాలని కొరటాల ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ (Jr NTR) వరుసగా హై బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Devara

వార్ 2 సెట్స్‌లో సందడి చేస్తున్న తారక్.. బాలీవుడ్‌లో తన మార్కెట్‌ను మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ బ్లాక్‌బస్టర్ అయితే, 1000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక తర్వాత ప్రశాంత్ నీల్‌తో (Prashanth Neel) చేస్తున్న సినిమా కూడా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌గా మారింది. వీటి తర్వాతే ఎన్టీఆర్ దేవర 2పై స్పష్టత ఇవ్వనున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, తాజాగా మరో ఆసక్తికర రూమర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ (Ranveer Singh) కోసం దేవర 2లో ఓ స్పెషల్ క్యారెక్టర్‌ను డిజైన్ చేస్తున్నారని టాక్. ఇప్పటికే మొదటి భాగంలో విలన్‌గా సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) నటించగా, రెండో పార్ట్‌లో బాలీవుడ్ లో మరింత క్రేజ్ తీసుకురావడానికి రణ్వీర్‌ను తీసుకోవాలని కొరటాల ఆలోచిస్తున్నాడట. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇప్పటికీ దేవర 2 ఉంటుందా లేదా అనే సందేహం కొనసాగుతుండగా, రణ్వీర్ సింగ్ చేరుతాడనే ఊహాగానాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

నిజంగా ఎన్టీఆర్ బిజీ లైనప్, బాలీవుడ్ ప్రాజెక్టుల మధ్య దేవర 2కి ప్రాధాన్యత ఇస్తాడా? లేక కొరటాల ముందుగా స్క్రిప్ట్‌ను హై లెవల్‌కు తీసుకెళ్లాకే సెట్స్ పైకి వెళ్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. ఏదేమైనా ఈ సస్పెన్స్‌కు క్లారిటీ రావాలంటే, తారక్ ప్రస్తుత కమిట్‌మెంట్స్ పూర్తయ్యేవరకు వేచి చూడాల్సిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus