బాలీవుడ్ నిర్మాత మరియు స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు అయిన సోహైల్ ఖాన్ విడాకుల తీసుకోబోతున్న విషయం బాలీవుడ్లో చర్చనీయాంశం అయ్యింది. అందరికీ ఆదర్శంగా చాలా అన్యోనంగా కాలం గడుపుతూ వచ్చిన ఈ జంట విడిపోవడం అనేది అందరూ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. సోహైల్ ఖాన్- సీమా ఖాన్లు 24ఏళ్ళు కాపురం చేసి ఇప్పుడు విడిపోయేందుకు రెడీ అవుతున్నారు.మొదట ఇది గాసిప్ ఏమో అనుకున్నారు. కానీ ఈ జంట శుక్రవారం నాడు ముంబై ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళడంతో ఇది నిజమే అని నిరూపించబడింది.
ఆల్రెడీ విడాకులకు వీరు దరఖాస్తు చేయడం కూడా జరిగిందట. ఇంత సడన్ గా వీళ్ళు విడాకులు తీసుకోవాలని ఎందుకు డిసైడ్ అయ్యారు… దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి? అన్నది ఇప్పుడు మరింత చర్చనీయాంశం అయ్యింది. 1998లో సోహైల్ ఖాన్- సీమా ఖాన్లు ఇంట్లోంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. వారి పేర్లు నిర్వాన్, యోహాన్. 2017లోనే వీళ్ళు విడాకులు తీసుకోబోతున్నారు అని వార్తలు వచ్చాయి కానీ వాటిని వీళ్ళు కొట్టిపారేశారు.
అలాంటి ఈ జంట మరో 5 ఏళ్ళకి నిజంగానే విడాకులకి అప్లై చేశారు.సోహైల్ ఖాన్ నటుడిగా 20కి పైగా సినిమాల్లో నటించాడు.అందులో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘వీర్’ ‘దబాంగ్’ వంటి సినిమాలు ఉన్నాయి. నిర్మాతగా 15 సినిమాలు రూపొందించారు.ఇందులో కూడా తన అన్నతో ‘రెడీ’ ‘జైహో’ వంటి చిత్రాలను నిర్మించాడు. దర్శకుడిగా కూడా 6 సినిమాలు తెరకెక్కించాడు.