Kannappa: ‘జైలర్’ టీంని కూడా దించేసిన మంచు విష్ణు.. కానీ

గతంలో చాలా క్లాసిక్ సినిమాలు వచ్చాయి. అందులో ‘భక్త కన్నప్ప’ కూడా ఒకటి అని అనడంలో సందేహం లేదు. వాస్తవానికి ఆ చిత్రాన్ని ప్రభాస్ తో రీమేక్ చేయాలని కృష్ణంరాజు అనుకున్నారు. కుదిరితే ‘గోపీకృష్ణా మూవీస్’ బ్యానర్ పై ఆయనే నిర్మించాలని అనుకున్నారు.కానీ స్క్రిప్ట్ వర్కౌట్ కాలేదు. అలాంటి క్లాసిక్ ను మంచు విష్ణు రీమేక్ చేయడానికి ముందుకొచ్చాడు.ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి ‘కన్నప్ప’ ని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు మంచు విష్ణు అండ్ టీం చెప్పుకొచ్చింది.

మొదట తనికెళ్ళ భరణి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు అంటూ ప్రచారం జరిగింది. కానీ ఎందుకో ఆయన ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. తర్వాత హిందీలో పలు సీరియల్స్ డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ గౌడ్ కు ‘కన్నప్ప’ దర్శకత్వం బాధ్యతలు అప్పగించారు. అయినప్పటికీ ఈ ప్రాజెక్టుపై ఎటువంటి అంచనాలు ఏర్పడలేదు. కానీ ఎప్పుడైతే ప్రభాస్- నయనతార వంటి స్టార్లు ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నారు అనే వార్త బయటకు వచ్చిందో అప్పటి నుండి ఈ సినిమా పై మంచి బజ్ ఏర్పడింది అని చెప్పొచ్చు.

అంతేకాదు ఆ తర్వాత మోహన్ లాల్ కూడా ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. అదీ కాక ఇప్పుడు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఎంపికైనట్టు టాక్ గట్టిగా వినిపిస్తోంది. అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ.. ఇది నిజమే అని స్పష్టమవుతుంది. కాగా మోహన్ లాల్, శివరాజ్ కుమార్..లు ఇటీవల వచ్చిన ‘జైలర్’ సినిమాలో కూడా అతిథి పాత్రలు పోషించారు. ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మరి (Kannappa) ‘కన్నప్ప’ లో వీళ్ళ పాత్రలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి..!

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus